పాలీకేబ్‌ ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

పాలీకేబ్‌ ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

వైర్లు, ఫాస్ట్‌మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ తయారీ సంస్థ పాలీకేబ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ఇప్పటికే ప్రారంభమైంది. మంగళవారం(9న) ముగియనున్న ఇష్యూకి రూ. 533-538 ప్రైస్‌బ్యాండ్‌ కాగా.. తద్వారా కంపెనీ రూ. 1346 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇతర  వివరాలు చూద్దాం...

యాంకర్‌ నిధులు
యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి గురువారం రూ. 401 కోట్లు సమీకరించినట్లు పాలీకేబ్‌ ఇండియా తెలియజేసింది. షేరుకి రూ. 538 ధరలో 74.5 లక్షల షేర్లను కేటాయించినట్లు వివరించింది. ఇష్యూలో 25కుపైగా యాంకర్‌ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలియజేసింది. 

బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా
పాలీకేబ్‌ బ్రాండుతో వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీకేబ్‌ ఇండియా 2014లో ఫ్యాన్లు, లైటింగ్‌ తదితర ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌(FMEG) విభాగంలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2016-18 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం, నికర లాభం 41 శాతం చొప్పున ఎగశాయి. కంపెనీ మొత్తం 24 తయారీ యూనిట్లను కలిగి ఉంది. వీటిలో టెక్నో ఎలక్ట్రోమెక్‌, ట్రాఫిగురా కంపెనీలతో ఏర్పాటు చేసిన రెండు జేవీ సంస్థలున్నాయి. కాగా.. రానున్న నాలుగేళ్లలో కేబుల్స్‌, వైర్స్‌ పరిశ్రమ వార్షికంగా 15 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ అంచనా వేస్తోంది. 2018లో రూ. 26 ఈపీఎస్‌ నమోదుకాగా.. 2019 తొలి 9 నెలల్లో రూ. 25 ఈపీఎస్‌ సాధించింది. ఇవి ఐపీవోకు వచ్చే ముందు గణాంకాలు.

దరఖాస్తు చేయవచ్చా?
పలు బ్రోకింగ్‌ సంస్థలు పాలీకేబ్‌ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ అభిప్రాయపడ్డాయి. కేబుళ్లు, వైర్ల విక్రయాలో కంపెనీ ముందుంది. పటిష్ట పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వీటికితోడు FMEG విక్రయాలనూ వేగంగా పెంచుకుంటోందని ప్రభుదాస్ లీలాధర్‌ పేర్కొంది. కేబుల్స్‌, వైర్స్‌ రంగంలోని ఇతర కంపెనీల 45-17 పీఈతో పోలిస్తే పాలీకేబ్‌ ఇండియా దాదాపు 22 పీఈలో లభిస్తున్నట్లు సెంట్రమ్‌ వెల్త్‌ తెలియజేసింది. కేబుల్స్‌, వైర్స్‌తో పోలిస్తే అధిక మార్జిన్లు లభించే ఎఫ్‌ఎంఈజీ విభాగం వృద్ధి కంపెనీకి లబ్ది చేకూర్చగలదని అభిప్రాయపడుతోంది. కంపెనీ రుణ, ఈక్విటీ నిష్పత్తి తక్కువగా ఉండటం ఆకర్షణీయమంటూ షేర్‌ఖాన్‌ పేర్కొంది. అయితే కేఈఐ ఇండస్ట్రీస్‌, ఫినొలెక్స్‌ కేబుల్స్‌ పీఈతో సమానంగా కంపెనీ ఐపీవో ధర ఉన్నట్లు తెలియజేసింది. క్రాంప్టన్‌ గ్రీవ్స్, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, హావెల్స్‌, కేఈఐతో పోలిస్తే పాలీకేబ్‌ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(RoE) తక్కువగా నమోదైనట్లు వివరించింది. మరికొంతమంది మార్కెట్‌ విశ్లేషకులు ఈ రంగంలో పేరున్న కంపెనీలు అధికమేనని.. సుప్రిసిద్ధ బ్రాండ్లతో కంపెనీ పోటీ పడాల్సి ఉండటంతో మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

(గమనిక:పాలీకేబ్‌ ఇండియా ఇష్యూ వివరాలు తెలియజేయడానికి మాత్రమే ఈ విశ్లేషణ. కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం మార్కెట్‌ నిపుణులను సంప్రదించగలరు)tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');