ఐబీ హౌసింగ్‌ చేతికి లక్ష్మీ విలాస్‌?

ఐబీ హౌసింగ్‌ చేతికి లక్ష్మీ విలాస్‌?

గత కొద్ది రోజులుగా లాభాల దౌడు తీస్తున్న ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ బ్యాంకును ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీనం చేసుకోనున్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇందుకు వీలుగా ఈ వారంలో అటు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ఇటు ఐబీ హౌసింగ్ ఫైనాన్స్‌ బోర్డులు సమావేశంకానున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ అంచనాలతోనే ఈ రెండు కౌంటర్లూ ఇటీవల వెలుగులో నిలుస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సైతం 2.2 శాతం పెరిగి రూ. 917 వద్ద కదులుతోంది. తొలుత రూ. 919 వరకూ ఎగసింది.

Image result for indiabulls housing finance

ఇతర విరాలు ఇలా
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌తో విలీన అంచనాలతో ఇటీవల లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో ఈ షేరు 45 శాతం ర్యాలీ చేసింది. కాగా..  షేరుకి రూ. 72 ధరలో గత నెలలో బ్యాంకు ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 460 కోట్లు సమీకరించింది. క్విప్‌ ద్వారా సమీకరించిన ఈ నిధులతో కేపిటల్‌ బేస్‌ పటిష్టమైనట్లు బ్యాంకు పేర్కొంది. Most Popular