రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీవో ఓకే

రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీవో ఓకే

కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో వచ్చిన తొలి పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీవోకు దాదాపు 2 రెట్లు అధికంగా స్పందన లభించింది. రూ. 17-19 ధరలో రైల్వే శాఖ చేపట్టిన ఐపీవో బుధవారం(3న) ముగిసింది. ఇష్యూకి సంస్థాగత ఇన్వెస్టర్లు 1.36 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుచేయగా.. సంపన్న వర్గాల నుంచి 0.8 శాతమే సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు 2.93 రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం మొత్తం 25.34 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 46.33 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి.  ప్రభుత్వం కంపెనీ ఈక్విటీలో 12.12 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ. 480 కోట్లు సమకూర్చుకుంది. Most Popular