Polycab India IPO Details...

Polycab India IPO Details...

ఈనెల 5న పాలీక్యాబ్‌ ఇండియా ఐపీఓ ప్రారంభం కానుంది. రూ.1346 కోట్ల నిధుల సమీకరణ కోసం వస్తోన్న ఈ కంపెనీ 17,582,000 షేర్లను విక్రయించనుంది. ఈనెల 9న ముగిసే ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.533-538గా కంపెనీ నిర్ణయించింది. 1.75 లక్షల షేర్లను ఉద్యోగుల వాటా కింద విక్రయించనున్నారు. అలాగే ఉద్యోగులకు ఒక్కో షేరుకు కంపెనీ రూ.53 డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌, ఎడెల్‌వైజ్‌ ఫైనాన్షియల్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యెస్‌ సెక్యూరిటీస్‌లు ఉన్నాయి. 

కంపెనీ నేపథ్యం..
వైర్స్‌ మార్కెట్లో దేశంలోని పేరెన్నికగన్న సంస్థ పాలీక్యాబ్‌ ఇండియా. ఇండర్‌ టి జయ్‌సింఘాని, అజయ్‌ జయ్‌ సింఘాని, రమేష్‌ టి జయ్‌సింఘాని కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు. కంపెనీకి 24 తయారీ యూనిట్లు, 2 జాయింట్‌ వెంచర్‌ సంస్థలు ఉన్నాయి. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, డయ్యూ డామన్‌లలో కంపెనీ యూనిట్లు ఉన్నాయి. వైర్లు, కేబుల్స్‌, ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ ఉత్పత్తులను తయారు చేస్తోన్న ఈసంస్థ, "పాలీక్యాబ్‌" బ్రాండ్‌తో విక్రయిస్తోంది. పవర్‌ కేబుల్స్‌, కంట్రోల్‌ కేబుల్స్‌, సోలార్‌ కేబుల్స్‌, బిల్డింగ్‌ వైర్‌ తదితర ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. అలాగే వెల్డింగ్‌ కేబుల్స్‌, రౌండ్‌ కేబుల్స్‌, రైల్వే సిగ్నలింగ్‌ కేబుల్స్‌, స్పెషాలిటీ కేబుల్స్‌, గ్రీన్‌ వైర్స్‌ తదితర ఉత్పత్తులను కూడా మ్యానుఫ్యాక్చరింగ్‌ చేస్తోంది. ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌, ఎల్‌ఈడీ లైటింగ్స్‌, స్విచ్‌లు, స్విచ్‌గేర్స్‌, సోలార్‌ ప్రోడక్ట్స్‌ తదితర ఇతర ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా కంపెనీ నిర్వహిస్తోంది. 

ఫైనాన్షియల్స్‌..
గత మూడేళ్ళుగా ఈ సంస్థగా చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. 2016లో రూ.5747 కోట్ల ఆదాయం రూ.183 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అలాగే 2017లో రూ.6122 కోట్ల ఆదాయంపై రూ.232 కోట్లు, 2018లో రూ.6986 కోట్ల ఆదాయంపై రూ.373 కోట్ల నికరలాభం నమోదు చేసింది. 2019 మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1703 కోట్లపై రూ.75 కోట్ల నికరలాభం ఆర్జించింది ఈ సంస్థ

పాలీక్యాబ్‌ ఐపీఓ వివరాలు..
IPO ప్రారంభం : 05-April-2019
IPO ముగింపు : 09-April-2019
IPO సైజు : సుమారు రూ.1346 Crore
ముఖవిలువ : ఒక్కో షేరుకు రూ.10
ధరల శ్రేణి : ఒక్కో షేరుకు రూ.533-538
లిస్టింగ్‌: BSE & NSE
రిటైల్‌ పోర్షన్‌ : 35%
ఈక్విటీ : 17,582,000 షేర్లు
లాట్‌ : కనీసం 27 షేర్లకు(రూ.14526) దరఖాస్తు చేయాలి
షేర్ల కేటాయింపు ప్రారంభం: 12-April-2019
రీ ఫండ్‌ : 15-April-2019
డీమ్యాట్‌లో షేర్ల క్రెడిట్‌ : 16-April-2019
లిస్టింగ్‌ : 18-April-2019Most Popular