త్వరలో పేటిఎం నుంచి షేర్లు కొనొచ్చు

త్వరలో పేటిఎం నుంచి షేర్లు కొనొచ్చు

ప్రముఖ పేమెంట్స్, రిఛార్జ్, యుటులిటీ పేమెంట్స్ సేవల సంస్థ పేటిఎం త్వరలో షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లోకి కూడా అడుగు పెట్టబోతోంది. తాజాగా సెబీ నుంచి అనుమతులు పొందినట్టు పేటిఎం సంస్థ వెల్లడించింది. తమ అనుబంధ సంస్థ పేటిఎం మనీ ద్వారా ఈ సేవలను అందించబోతున్నట్టు పేటిఎం బ్రాండ్‌ను కలిగిన ఒన్97 కమ్యూనికేషన్స్ సంస్థ తెలియజేసింది. ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్ సహా వివిధ ప్రోడక్టులను ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇందుకోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి బ్రోకింగ్ లైసెన్సులను కూడా పొందింది పేటిఎం మనీ. అయితే సేవలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే అంశాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే వివిధ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పేటిఎం మనీ, తమ సబ్‌స్క్రైబర్లకు మ్యూచువల్ ఫండ్ కొనుగోలు సేవలను అందిస్తోంది. Most Popular