మెట్రోపొలిస్ ఐపీఓ

మెట్రోపొలిస్ ఐపీఓ

ఆదాయపరంగా దేశంలోని అతపెద్ద డయాగ్నాస్టిక్‌ కంపెనీల్లో ఒకటి మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌. ఈనెల 3న ఐపీఓకు రానున్న ఈ సంస్థ రూ.2 ముఖ విలువ కలిగిన 15,269,684 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందులో కంపెనీ ప్రమోటర్‌ డా.సుశీల్ కునుభాయ్‌ షా 5,017,868 షేర్లను విక్రయించనున్నారు. ఈనెల 5న ముగిసే ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ.877-880గా కంపెనీ నిర్ణయించింది. 

కంపెనీ నేపథ్యం : 
కంపెనీ ప్రమోటర్లుగా డా.సుశీల్‌ కునుభాయ్‌ షా, అమీరా సుశీల్‌ షా, మెటాజ్‌ అడ్వైజరీ ఎల్‌ఎల్‌పీలు ఉన్నారు.  ప్రస్తుతం ఈ సంస్థ 18 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. దక్షిణ భారతదేశంలో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ లీడింగ్‌ పొజీషన్‌లో ఉంది. ఘనా, కెన్యా, జాంబియా, మారిషస్‌, శ్రీలంకల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ సంస్థ థర్డ్‌ పార్టీ ద్వారా నేపాల్‌, నైజీరియా, యూఏఈ, ఒమన్‌ దేశాల్లో కూడా సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ల్యాబ్స్‌ ప్రమాణాలు కలిగిన ఈ సంస్థ అన్ని రకాల టెస్టులను పరీక్షిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 16.0 మిలియన్లకు పైగా టెస్టులను చేసింది. అలాగే ఈ సంస్థను 7.7 మిలియన్‌ల పేషెంట్లు సందర్శించారు.

లీడ్‌ మేనేజర్స్‌ :
కంపెనీ లీడ్‌ మేనేజర్స్‌గా JM Financial Ltd, Credit Suisse Securities (India), Goldman Sachs (India), Securities Pvt. Ltd., HDFC Bank Ltd, Kotak Mahindra Capitalలు ఉన్నాయి. 

ఆర్థిక వివరాలు :
గత మూడేళ్ళుగా ఈ సంస్థ చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. 2016లో రూ.491 కోట్ల ఆదాయంపై రూ.80 కోట్ల లాభం ఆర్జించింది. అలాగే 2017లో రూ.568 కోట్ల ఆదాయంపై రూ.108 కోట్ల లాభం, 2018లో రూ.652 కోట్ల ఆదాయంపై రూ.111 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో అంతర్జాతీయ వ్యాపారం రూ.40 కోట్లుగా ఉంది. 

మెట్రో పోలిస్‌ ఐపీఓ పూర్తి వివరాలు..
ఐపీఓ ప్రారంభం : 03-ఏప్రిల్‌-2019
ఐపీఓ ముగింపు : 05-ఏప్రిల్‌-2019
ఐపీఓ  సైజు : సుమారు రూ.1204 కోట్లు
షేర్‌ ముఖవిలువ : రూ.2
ధరల శ్రేణి : రూ.877-880
లిస్టింగ్‌ : బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ
రిటైల్‌ పోర్షన్‌ : 10 శాతం
క్యూఐబీ పోర్షన్‌ : 10 శాతం
హెచ్‌ఎన్‌ఐ పోర్షన్‌ : 15 శాతం
జారీ చేసే ఈక్విటీ: 15,269,684 షేర్లు
లాట్‌ సైజ్‌ : కనీసం 17 షేర్ల(రూ.14,960)కు అప్లయ్‌ చేయాలి
షేర్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం : 10-ఏప్రిల్‌-2019
రీఫండ్స్‌ : 11-ఏప్రిల్‌-2019
డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్ల జమ‌: 12-ఏప్రిల్‌-2019
లిస్టింగ్‌: 15-ఏప్రిల్‌-2019 (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)Most Popular