ఏప్రిల్‌ 1న బ్యాంకులకు సెలవు

ఏప్రిల్‌ 1న బ్యాంకులకు సెలవు

సెలవు కారణంగా సోమవారం (ఏప్రిల్‌ 1న) బ్యాంకులు పనిచేయవు. ఆదివారం వర్కింగ్‌ డే కావడంతో దేశంలోని అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు సోమవారం సెలవు. అదే విధంగా ఇవాళ (మార్చి 30న) కూడా పని చేయనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు చివరి శనివారం అయినప్పటికీ ఈ 2 రోజులు బ్యాంకులు పని చేయనున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రేపు చివరి రోజు. దీంతో యాన్యువల్ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌తో ఈ ఆదివారంతో ముగుస్తాయి. ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్ళు, అలాగే జీతభత్యాల చెల్లిపుల తదితర లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్‌ బ్రాంచీలు ఆదివారం పనిచేయనున్నాయి. పే అండ్‌ అకౌంట్‌ బ్యాంక్‌ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయాలని కేంద్రం సూచించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే ప్రభుత్వ లావాదేవీలన్నీ కూడా ఈ ఆర్ధిక సంవత్సర ఖాతాల్లో ప్రతిబింబించేలా చూడాలని తెలిపింది. ఇందుకు ఏజెన్సీ బ్యాంకుల శాఖల్లోని  కౌంటర్లు ఈ నెల 30వ తేదీ రాత్రి 8 గంటల వరకు, 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ తన ఆదేశాల్లో పేర్కొంది. RTGS, NEFT వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించారు.Most Popular