ఓలా నుంచి కొత్త సర్వీస్:

ఓలా నుంచి కొత్త సర్వీస్:

రవాణా విభాగంలో ఓలా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బైక్స్, ఆటో, కార్‌ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ వరకూ క్యాబ్ సౌకర్యాలను అందిస్తున్న ఓలా... త్వరలో ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్స్‌లో మరో విభాగాన్ని ప్రారంభించేందుకు యత్నాలను తీవ్రం చేసింది.
సెల్ఫ్-డ్రైవ్ విభాగం కోసం కసరత్తులు చేస్తున్న ఓలా.. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లను ఆరంభ పెట్టుబడి చేయనుంది. డెట్ మరియు ఈక్విటీల రూపంలో ఈ మొత్తం పెట్టుబడి చేయనున్నారు. లగ్జరీ సెడాన్‌ల నుంచి ఎస్‌యువీల వరకు 10వేల వాహనాలతో సేవలు ప్రారంభించనుంది ఓలా. దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని నెలల్లోనే ఈ సేవలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
"మార్కెట్ ఫీడ్‌బ్యాక్ అనుసరించి మేము రెంటల్స్, సబ్‌స్క్రిప్షన్, కార్పొరేట్ లీజింగ్ సెగ్మెంట్‌లలో పైలట్ సర్వీసులను నిర్వహించనున్నాం, రాబోయే కొన్ని వారాల్లో ఈ పైలట్ సేవలు ప్రారంభం అవుతాయి" అని ఓలా ప్రతినిధి ఒకరు తెలిపారు.
కొత్త వ్యాపారం కోసం ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్ ద్వారా డెట్‌ను సేకరించనున్నారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టైగర్ గ్లోబల్‌లు పెట్టుబడులు చేస్తాయని తెలుస్తోంది.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, ఇప్పటివరకూ 3.67 బి. డాలర్లను సేకరించింది. తాజా ఫండింగ్ రౌండ్ ప్రకారం ప్రస్తుతం సంస్థ వాల్యుయేషన్ 6 బిలియన్ డాలర్‌లుగా ఉంది.

సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులు
భారత మార్కెట్‌కు తగిన విధంగా సేవలు అందించడం కోసం సౌత్ కొరియా ఆటో దిగ్గజాలు అయిన హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్‌తో చర్చలు నిర్వహిసతున్నట్లు ఓలా చెబుతోంది.
రాబోయే కొన్ని వారాల్లో దేశంలోని ప్రధానమైన 5-7 నగరాల్లో కొత్త సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ సర్వీస్ ప్రారంభం కానుంది.
దేశంలో అతి పెద్ద సెల్ఫ్-డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీగా ఎదగాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఓలా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో మైల్స్, జూమ్ కార్, డ్రైవ్‌జీ వంటి కంపెనీలు సేవలు అందిస్తున్నాయి.Most Popular