విస్తరణపై గూగుల్‌ పే కసరత్తు

విస్తరణపై గూగుల్‌ పే కసరత్తు

ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి ఎంటర్‌ అయ్యేందుకు కసరత్తు ప్రారంభించింది డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ గూగుల్‌ పే. రిటైల్‌ మార్కెట్లోకి షాపులు, స్టోర్స్‌లో చెల్లింపుల్లో గూగుల్‌ పేను వాడేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చేస్తున్న చెల్లింపులను పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌)లో కూడా వినియోగించేలా ఆఫ్‌లైన్‌ను తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో కాలిఫోర్నియా సంస్థ ఫోన్‌పే, పేటీఎంలు ఉండగా, ఇటీవల మరో అమెరికా సంస్థ అమెజాన్‌ కూడా ఎంటరైంది. తాము కూడా ఈ రంగంలోకి ప్రవేశించి అగ్రస్థానంలో నిలవాలని గూగుల్‌ పే యోచిస్తోంది. 

గూగుల్‌ ప్లే మంత్లీ యాక్టివ్‌ యూజర్స్‌ గత కొంతకాలంగా భారీగా పెరుగుతోన్నారు. గత ఏడాది మార్చిలో 14 మిలియన్లుగా ఉన్న కస్టమర్లు ప్రస్తుతం 45 మిలియన్లకు పెరిగారు. అంటే గ్రోత్‌ రేట్‌ మూడు రెట్ల పైమాటే. వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తూ, వారిని మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తమ లక్ష్యమని, దీని కోసం తాము ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లోకి కూడా ఎంటర్‌ కానున్నట్టు గూగుల్‌ పే డైరెక్టర్‌(ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌) అంబరీష్‌ కేన్‌ఘే తెలిపారు. 
 Most Popular