వచ్చే నెల 1 నుంచి డీమ్యాట్‌ రూపంలోనే షేర్ల బదిలీలు

వచ్చే నెల 1 నుంచి డీమ్యాట్‌ రూపంలోనే షేర్ల బదిలీలు

వచ్చే ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీ తప్పనిసరిగా కేవలం డీమ్యాట్‌ రూపంలోనే జరగాలని సెబీ స్పష్టం చేసింది. లిస్టెడ్‌ కంపెనీల షేర్ల బదిలీ డీమ్యాట్‌ రూపంలో మాత్రమే జరగాలని 2018 మార్చిలో సెబీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పలుసార్లు గడువును పొడిగించారు. మూడునెలల క్రితం ఈ గడువును డిసెంబర్‌ 31, 2018 నుంచి మార్చి 31, 2019కి పెంచారు. ఈ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అయితే ఈసారి గడవును మాత్రం పెంచబోమని, ఇదే తుది గడువని, తప్పనిసరిగా ఏప్రిల్‌ 1 నుంచే డీమ్యాట్‌ రూపంలో షేర్ల ట్రాన్స్‌పర్‌ జరగాలని సెబీ వెల్లడించింది.

షేర్ల లాభాలపై కంపెనీ మేనేజ్‌మెంట్‌పై వస్తున్న ఆందోళనలతో షేర్లను డీమ్యాట్‌ రూపంలో నిర్వహించడం వల్ల సంస్థకు సంబంధించిన లాభాలలో పారదర్శకత ఉంటుంది. అయితే వారసత్వంగా వచ్చిన షేర్లు(ట్రాన్స్‌మిషన్‌), పేరు క్రమసంఖ్య మార్పు(ట్రాన్స్‌పోజిషన్‌) జరిగే షేర్ల విషయంలో ఈ నిబంధన వర్తించవని తెలిపింది.  అయితే ఇన్వెస్టర్లు పేపర్‌ రూపంలో షేర్లు అట్టిపెట్టుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని సెబీ వెల్లడించింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');