బ్యాంక్ స్టాక్స్ కొనేముందు కాస్త ఆగండి.. ఎందుకంటే ?

బ్యాంక్ స్టాక్స్ కొనేముందు కాస్త ఆగండి.. ఎందుకంటే ?

మనం ఎక్కడ ఉన్నాం? గత నెల రోజులలో నిఫ్టీ 50 ఇండెక్స్ భారీగా ర్యాలీ చేసింది. ఆల్-టైం గరిష్టానికి 2.6 శాతం దూరంలో నిలిచింది. పలు రంగాలు, స్టాక్స్‌లో మూమెంటం కారణంగా బ్యాంకింగ్ ఇండెక్స్‌కు భారీ మద్దతు లభించి, జీవిత కాల గరిష్ట స్థాయి అయిన 30 వేల పాయింట్ల చేరువలో నిలిచింది. అప్‌సైడ్ మూమెంటం కనబరిచిన ఎనర్జీ సెక్టార్ కూడా, గత నెలరోజులుగా ఆ రంగంలోని స్టాక్స్ 10-15 పెరుగుదల కనబరిచాయి. గతేడాది ఇదే కాలంతో పోల్చితే క్రూడ్ ధరలు 25 శాతం అధికంగా ఉన్నా, ఎనర్జీ రంగంలోని స్టాక్స్ పెరగడం విశేషం. మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్‌లు ఈ నెలలో వరుసగా 6.2 శాతం మరియు 10.2 శాతం చొప్పున పెరిగాయి. ప్రధాన ఇండెక్స్‌లను ఔట్‌పెర్ఫామ్ చేశాయి. ఇదే సమయంలో నిఫ్టీ ఐటీ, ఆటో రంగాలు ఫ్లాట్ నుంచి నెగిటివ్‌గా ఉండి 1.1 శాతం, 0.2 శాతం చొప్పున తగ్గాయి.

 

ఫిబ్రవరి 19న కనబరిచిన 10,600 స్థాయి నుంచి నిఫ్టీ 50 సూచీ నెల రోజుల పాజిటివ్ ట్రెండ్‌ను పూర్తి చేసింది. ఈ సమయంలో 11,280-11,300 మధ్య ప్రస్తుత నెల సగటు ప్రకారం, కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెల్స్, ఆటో రంగాలలో పాజిటివ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుండడంతో, రాబోయే రెండు నెలల కాలంలో 11,800 పాయింట్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్చ్ నెల డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ ఈ వారం ఉండడంతో రోలోవర్‌ల కారణంగా మార్కెట్‌లో ఊగిసలాటకు అవకాశాలు ఉన్నాయి.

ఇన్వెస్టర్‌లు ఏం చేయాలి? 
మార్కెట్లు సానుకూలంగానే ఉండే అవకాశం ఉండగా... ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్స్ మరియు ఆటోమొబైల్ రంగాలు అండర్‌పెర్ఫామెన్స్ చేసే అవకాశం ఉంది. రిస్క్‌తో పోల్చితే దక్కే ప్రతిఫలం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో, ఈ రంగాలలో కొనుగోళ్లకు ఆస్కారం చిక్కవచ్చు. ఇక బ్యాంకింగ్ సెక్టార్ విషయానికి వస్తే, ఈ రంగంలో కరెక్షన్ కోసం ఎదురుచూడవచ్చు. Most Popular