ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నుంచి భారత్ కన్‌జంప్షన్ స్కీమ్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నుంచి భారత్ కన్‌జంప్షన్ స్కీమ్

మంగళవారం నాడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సంస్థ... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ కన్‌జంప్షన్ స్కీమ్‌ను లాంఛ్ చేసింది.
భారతీయ వినియోగ రంగంతో పాటు లబ్ధి పొందే విధంగా ఈ స్కీమ్‌ను రూపొందించారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న వినియోగ వ్యవస్థలలో భారత్ కూడా ఒకటి అనే విషయం మనకు తెలుసు. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అందిస్తున్న ఈ ఆఫర్... మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 9వరకు అందుబాటులో ఉండనుంది.

“అంతర్జాతీయంగా అత్యధిక మిల్లీనియల్ జనాభా కలిగిన మన దేశంలో, గత తరాలతో పోల్చితే లైఫ్ స్టైల్ ఎంపికలు, వినియోగ విధానం, సౌకర్యాల ఎంపిక, బ్రాండ్ ప్రాధాన్యతల విషయంలో ఈ తరం మిల్లీనియల్ వ్యక్తులు అధికంగా దృష్టి సారించారు. ఇది కన్జూమర్ మార్కెట్ మరియు రిటైలర్‌లకు ఎన్నో అవకాశాలను అందిస్తోంది,” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సంస్థ ఎండీ & సీఈఓ నిమేష్ షా తెలిపారు.Most Popular