లారస్‌ జూమ్‌- జూబిలెంట్‌ పతనం

లారస్‌ జూమ్‌- జూబిలెంట్‌ పతనం

గ్లోబల్‌ ఫండ్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ లారస్‌ లేబ్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో ఈ కౌంటర్ సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క మైసూరులోని నంజగడ్‌ ఏపీఐ తయారీ ప్లాంటుపై యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారిక చర్యలు తీసుకోనున్నట్లు(OAI) తెలియజేసిన నేపథ్యంలో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం...

లారస్‌ లేబ్స్
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధాల కొనుగోలుకి గ్లోబల్‌ ఫండ్‌ నుంచి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు లారస్‌ లేబ్స్‌ తెలియజేసింది. దీనిలో భాగంగా టెనోఫోవిర్‌, లామివుడైన్‌, డొల్యూట్‌గ్రావిర్‌ ఔషధాలు 300/350/50 ఎంజీ డోసేజీలలో సరఫరా చేయవలసి ఉంటుందని పేర్కొంది. వీటికి ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి సూచనప్రాయ అనుమతి పొందాక తొలిసారి లభించిన కాంట్రాక్టుగా తెలియజేసింది. మూడున్నరేళ్లపాటు అమలులో ఉండే కాంట్రాక్టులో భాగంగా ఔషధాలను దక్షిణాఫ్రికా(సహారా) ప్రాంతాలలో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లారస్‌ లేబ్స్ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 390 వద్ద ట్రేడవుతోంది.

Image result for jubilant life sciences ltd

జూబిలెంట్‌ లైఫ్‌ 
కర్ణాటక మైసూరులోగల ఏపీఐ తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ OAIకు తెరతీయడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల్లో 21 శాతం పతనమైన ఈ షేరు ప్రస్తుతం మరోసారి అమ్మకాల ఒత్తిడిలో పడింది. ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం తిరోగమించి రూ. 692 వద్ద ట్రేడవుతోంది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. నంజగడ్‌ ప్లాంటుకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు లేదా సప్లిమెంట్స్‌కు అనుమతులను నిలిపివేయనున్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ నెల 21న తెలియజేసింది. డిసెంబర్‌లో ఈ ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టింది.Most Popular