ట్రైడెంట్‌- ఆర్‌ఐఎల్‌... ప్లస్‌లో!

ట్రైడెంట్‌- ఆర్‌ఐఎల్‌... ప్లస్‌లో!

పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ తయారీకిగాను అమెరికా నుంచి పేటెంట్‌ను పొందినట్లు పేర్కొనడంతో హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ ట్రైడెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. మరోపక్క మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ జాన్‌ ప్లేయర్స్‌ను డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ నుంచి సొంతం చేసుకున్నట్లు వెల్లడించడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇతర వివరాలు చూద్దాం..

ట్రైడెంట్‌ 
పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం ద్వారా యూఎస్‌ నుంచి పేటెంట్‌ను పొందినట్లు హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ ట్రైడెంట్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. పర్యావరణానికి హానిచేసే రసాయన వినియోగంలేని ఈ ఫ్యాబ్రిక్‌తో బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌ ప్రొడక్టులను రూపొందించేందుకు వీలున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ట్రైడెంట్‌ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 68 వద్ద ట్రేడవుతోంది. 

Image result for Reliance trends

ఆర్‌ఐఎల్‌
ప్రసిద్ధ మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ జాన్‌ ప్లేయర్స్‌తోపాటు సంబంధిత హక్కులను ఐటీసీ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్ రిటైల్‌ మాతృ సంస్థ ఆర్‌ఐఎల్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 1352 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1356 వరకూ ఎగసింది. అయితే ప్రస్తుతానికి డీల్‌ విలువ.. తదితర వివరాలు తెలియరాలేదు. జాన్‌ ప్లేయర్స్‌ బ్రాండుతోపాటు.. పంపిణీ హక్కులను రూ. 150 కోట్లకు విక్రయించినట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి.Most Popular