నరేష్ గోయల్.. ఇప్పుడో చరిత్ర ! ఉవ్వెత్తున ఎగిసి.. రెక్కలు తెగి...!

నరేష్ గోయల్.. ఇప్పుడో చరిత్ర ! ఉవ్వెత్తున ఎగిసి.. రెక్కలు తెగి...!

25 ఏళ్ళ క్రితం ప్రారంభమైన ప్రస్థానం అది. విమాన యాన రంగంలో సరికొత్త పుంతలు తొక్కించి ఇండియన్ ఎయిర్ లైన్స్ ను రెండో స్థానానికి దించేసిన ఘనత ఆ సంస్థది. 22,000 మంది ఉద్యోగులు , దాదాపు 112 విమానాలు కలిగి ఉన్న దిగ్గజ విమాన యాన సంస్థ అది. కానీ..ఇప్పుడు సంస్థను స్థాపించిన వ్యక్తులే.. ఆ సంస్థను విడాల్సిన దుస్థితి వచ్చేసింది. బోర్డు నుండి సగౌరవంగా తప్పుకుని, అవమాన భారంతో గద్గద స్వరంతో బయటకు వెళ్ళిపోయారు. ఉవ్వెత్తున ఎగసి, రెక్కలు తెగి.. సంస్థ ఉద్యోగుల క్షేమమే తన లక్ష్యం అంటూ తన పదవులకు రాజీనామాలు చేశారు జెట్ ఎయిర్ లైన్స్ అధినేత నరేష్ గోయెల్, అనితా గోయెల్ .

Image result for jet airways logoImage result for jet airways logo
విమాన యాన రంగంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ కు ధీటుగా , సరికొత్త ప్రైవేట్ విమాన యానాన్ని జెట్ ఎయిర్ వేస్‌ పేరిట నరేష్‌ గోయెల్, అతని భార్య అనితా గోయెల్ ప్రారంభించారు. అంచెలంచలుగా ఎదిగిన జెట్ ఎయిర్ వేస్ తన వాటాదారులకు, మదుపర్లకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. కాల క్రమంలో పోటీ సంస్థలు పెరిగిపోవడం, ఇంధన ముడి ఖర్చులు పెరిగిపోవడం, వాటా దారులు, రుణదాతలకు బకాయిలు చెల్లించలేక పోవడం వంటి పలు కారణాలతో జెట్ క్రమంగా మసకబారింది. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి నెట్టబడింది. 

Image result for jet airways
జెట్ ఎయిర్ వేస్‌కు 2013 నుండి యూఏఈకి చెందిన  ఎతిహాద్‌ ఎయిర్ లైన్స్ వాటాదారుగా ఉంది. దాదాపు $379 డాలర్ల పెట్టుబడులను జెట్ ఎయిర్‌వేస్‌లో పెట్టింది. ఆ తరువాత చౌక విమాన యానం పేరిట పలు సంస్థలు దేశీయ విమాన యాన రంగంలోకి ప్రవేశించడం, స్పైస్ జెట్ తన టిక్కెట్ ధరలను ఒక్కసారిగా తగ్గించడంతో జెట్ ప్రయాణీకులు అందరూ స్పైస్ జెట్‌కు , ఇతర విమాన సంస్థలకు మళ్ళారు. దీంతో జెట్ నష్టాల బాటన పయనించడం మొదలైంది. గ్రౌండ్ నిర్వాహణ ఖర్చులు పెరిగిపోవడం, ఇంధన ఛార్జీలు పెరిగిపోవడం వంటి కారణాలు, ఇతర సంస్థలతో పోటీలో నిలవడానికి జెట్ కూడా విమాన యాన రేట్లను తగ్గించాల్సి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Image result for jet airways

SBI నేతృత్వంలోని  బ్యాంకుల కన్సార్టియం కు చెల్లించాల్సిన రుణాలు దాదాపు రూ. 8,000 కోట్లకు పెరిగిపోయాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా నరేష్ గోయెల్ టాటా గ్రూప్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌కు యత్నించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎతిహాద్‌ను తన వాటాను పెంచాల్సిందిగా కోరినా.. ఎతిహాద్ సానుకూలంగా స్పందించలేదనే చెప్పాలి. చివరాఖరికి జెట్ బోర్డు నుండి నరేష్ గోయెల్ తప్పుకుని, తన వాటాను 51శాతం నుండి 21శాతానికి తగ్గించుకుంటే... కొత్త ఇన్వెస్టర్లు వస్తారని ఎస్బీఐ పేర్కొనడంతో సంస్థ మరిన్ని కష్టాల్లో పడింది. నరేష్ తన వాటాలను తగ్గించుకోడానికి తొలుత సముఖత వ్యక్తం చేయలేదు. కానీ.. రాను రాను పరిస్థతి మరింత దిగజారింది. పలు విమాన సర్వీసులను రద్దు చేయడం, అంతర్జాతీయ రూట్లలో విమానాల రద్దు, మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దైన్యంలో జెట్ ఎయిర్ వేస్ పడిపోయింది. మార్చ్ 31 కల్లా తమ సమస్యలను పరిష్కరించక పోతే.. ఏప్రిల్ 1 నుండి విధుల్లోకి రాబోమని జెట్‌కు చెందిన పైలెట్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ఆల్టిమేటం జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది. సంక్షోభ పరిష్కారం దిశగా కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఎస్బీఐ ఎతిహాద్‌తో జరిపిన చర్చల్లో ఎతిహాద్‌కు ఇప్పుడున్న వాటాలను కూడా వదిలేసుకుంటామని చెప్పడంతో జెట్ పరిస్థతి కనాకష్టంగా మారింది. ఇక తప్పని పరిస్థితుల్లో నరేష్ గోయెల్ , ఆయన భార్య అనితా గోయెల్ బోర్డు నుండి వైదొలగాల్సి వచ్చింది.

Image result for naresh goyal anita goyal

దీంతో ఎస్బీఐ కన్సార్టియంకు జెట్ ఎయిర్ వేస్‌లో 51శాతం వాటా దక్కినట్టైంది. నరేష్ గోయెల్ వాటా 51శాతం నుండి 25శాతానికి పరిమితమైంది. ఎతిహాద్ వాటాలు కూడా 24శాతం నుండి 12శాతానికి పరిమితమయ్యాయి. నరేష్ గోయెల్ నిష్క్రమణతో జెట్ ఎయిర్ వేస్‌ను కొనుగోలు చేయడానికి ఇతర పెట్టుబడిదార్లకు మార్గం సుగమమైందని ఎస్బీఐ పేర్కొంది. జెట్ ఎయిర్ వేస్ ప్రస్థానం, 22 వేల మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం తాను ఈ త్యాగం చేస్తున్నానని నరేష్ గోయెల్ పేర్కొనడం కొసమెరుపు. ఏది ఏమైనా జెట్ ఎయిర్ వేస్‌లో ఒక శకం ముగిసినట్టే అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త యాజమాన్యం చేతిలో జెట్ మరింత వృద్ధిని  సాధించాలని ఇతర విమాన యాన సంస్థలు ఆశిస్తున్నాయి. 

 Most Popular