ఫ్లైట్ ఛార్జీల దూకుడుకు కళ్లెం ! జెట్ ఎయిర్ గండం గట్టెక్కింది

ఫ్లైట్ ఛార్జీల దూకుడుకు కళ్లెం ! జెట్ ఎయిర్ గండం గట్టెక్కింది

జెట్ ఎయిర్ వేస్ ... కొద్ది కాలం క్రితం దేశీయ  విమాన రంగాన్ని సరికొత్త అంచులకు చేర్చిన సంస్థ అది. ప్రైవేట్ విమాన యాన సంస్థ కింగ్ ఫిషర్ మూత పడగానే.. ఉవ్వెత్తున ఎగిసిన సంస్థ జెట్ . కానీ కాలక్రమంలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ తగ్గడం, అధిక ముడి చమురు ఖర్చులు, పోటీ సంస్థల భారీ డిస్కౌంట్ ఆఫర్ల దెబ్బకు కునారిల్లింది. తన వద్ద నున్న విమానాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి పడిపోయింది. రుణదాతల నుండి ఒత్తిళ్లు, సంస్థకు మద్దతుగా నిలిచిన ఎతిహాద్ విమాన సంస్థ నుండి కూడా ఒత్తిళ్లు అధికం కావడంతో పూర్తిగా డీలా పడింది జెట్ ఎయిర్ వేస్. ఆఖరికి సంస్థ ఫౌండర్, ఎండీ నరేష్ గోయెల్ తన పదవి నుండి తప్పుకోవడంతో అప్పుల ఊబిలో చిక్కుక్కున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతలు కొత్తవారికి అప్పగించే సూచనలు ఉన్నాయి. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం గండం నుంచి తాత్కాలికంగా గట్టెక్కించిందని చెప్పొచ్చు.

రంగంలోకి దిగిన డీజీసీఏ...
జీతాలు అందకపోవడంతో పైలెట్లు తమ విధులకు హాజరుకాకపోవడంతో గత నెలరోజులుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ పలు సర్వీసులను రద్దు చేసింది. జెట్‌ ఎయిర్‌వద్ద మొత్తం 119 ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉండగా అందులో కేవలం 34 మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో మిగిలిన విమానయాన సంస్థలు ఛార్జీలను ఒక్కసారిగా పెంచాయి. దీనికితోడు ఈనెల్లో ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ క్రాష్‌ కావడంతో పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. అలాగే భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొని ఉండటంతో పలు సర్వీసులు రద్దు అయ్యాయి. ఇదే అదనుగా భావించి పలు సంస్థలు విమాన ఛార్జీలను పెంచాయి. దీంతో  డీజీసీఏ జోక్యం చేసుకుని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిని కొంతమేర అదుపులోకి తెచ్చింది. అయినా ఛార్జీల పెరుగుదలపై ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారు. 

ఫ్లైట్ ఛార్జీల దూకుడుకు కళ్లెం...
జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం ఒక కొలిక్కి రావడంతో త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ సంస్థ విమానాలు కార్యకలాపాలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఇప్పటికే భారీగా పెరిగిన ఫ్రైట్‌ ఛార్జీల దూకుడుకు కళ్ళెం పడనుంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్ల డేటా ప్రకారం ఢిల్లీ-ముంబాయి వంటి రద్దీ రూట్లలో గత రెండు వారాలుగా విమాన ఛార్జీలు 23 శాతం పెరిగాయి. జెట్‌ఎయిర్‌వేస్‌ తమ సర్వీసులను మళ్ళీ ప్రారంభించనుండటంతో ఛార్జీలు ఒక్కసారిగా దిగిరానున్నాయి. దీంతో మిగిలిన కంపెనీలు కూడా ధరల తగ్గింపుపై యోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 

పెరిగిన ఎయిర్‌ట్రాఫిక్‌...
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమాన సర్వీసులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిల్లో దేశీయంగా 23.8 మిలియన్ల ప్యాసింజర్లు ఉన్నారు. ఇది గత ఏడాది ఇదే సమయంలో ప్రయాణించిన ప్రయాణికులతో పోలిస్తే 7శాతం అధికం. వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులు విమాన సర్వీసులపై ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');