డీఎల్‌ఎఫ్‌ జోరు- ఐసీఐసీఐ ప్రు డీలా

డీఎల్‌ఎఫ్‌ జోరు- ఐసీఐసీఐ ప్రు డీలా

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈక్విటీ వాటా విక్రయం(క్విప్‌) ద్వారా నిధులను సమీకరించనున్నట్లు తెలియజేయడంతో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ప్రమోటర్లు వాటాను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం...

డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌
క్విప్‌ ద్వారా మొత్తం దాదాపు రూ. 3,200 కోట్లు సమీకరించనున్నట్లు డీఎల్‌ఎఫ్‌ తాజాగా తెలియజేసింది. ఇందుకు షేరుకి రూ. 193 ఫ్లోర్‌ ధరగా నిర్ణయించింది. కాగా.. క్విప్‌లో భాగంగా ప్రమోటర్లు రూ. 2500 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 3,000 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో డీఎల్‌ఎఫ్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ ఎగసింది.

Related image

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌
విదేశీ భాగస్వామ్య సంస్థ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్ హోల్డింగ్స్‌ 2.6 శాతం వాటాకు సమానమైన 3.73 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ తెలియజేసింది. ఒకవేళ అధిక స్పందన లభిస్తే మరో 1.1 శాతం వాటాను సైతం అమ్మేవీలున్నట్లు వివరించింది. ఇందుకు ఫ్లోర్‌ ధరను రూ. 300గా నిర్ణయించింది. ఇది మార్కెట్‌ ధరకు దాదాపు 7 శాతం డిస్కౌంట్‌కాగా. తద్వారా రూ. 1600 కోట్లు సమీకరించే వీలుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 312 వరకూ నీరసించింది.Most Popular