మార్కెట్ల టర్న్‌అరౌండ్‌- రియల్టీ అప్‌

మార్కెట్ల టర్న్‌అరౌండ్‌- రియల్టీ అప్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చన్న ఆందోళన నుంచి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బయటపడ్డాయి. సోమవారం అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియగా.. ఆసియాలో కొనుగోళ్లదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ బాటలో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 141 పాయింట్లు పుంజుకుని 37,950కు చేరగా.. నిఫ్టీ సైతం 47 పాయింట్లు బలపడి 11,401 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తలెత్తనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా, సోమవారం ఆసియా స్టాక్‌ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే.

ఐటీ మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఐటీ ఇండెక్స్‌ మాత్రమే(0.8 శాతం) వెనకడుగులో ఉంది. ప్రధానంగా రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్‌, మెటల్‌ 2.4-0.7 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, శోభా, మహీంద్రా లైఫ్‌ 5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, జీ, ఆర్‌ఐఎల్‌, గెయిల్‌, ఐబీ హౌసింగ్, హెచ్‌పీసీఎల్‌, ఎస్‌బీఐ 3-1 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రొ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, యూపీఎల్‌ 1 శాతం స్థాయిలో నీరసించాయి. 

జెట్‌ ఎయిర్‌ జోరు
డెరివేటివ్స్‌ విభాగంలో జెట్‌ ఎయిర్‌వేస్‌, జీఎంఆర్‌, మహానగర్‌ గ్యాస్, ఇండియా సిమెంట్స్‌, ఐఆర్‌బీ, జస్ట్‌ డయల్‌ 7-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐసీఐసీఐ ప్రు, యూబీఎల్‌, ఇండిగో, హెక్సావేర్‌, టాటా ఎలక్సీ 2.3-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావడంతో మధ్య, చిన్నస్థాయి షేర్లలోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1105 లాభపడగా.. 516 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో డ్రెడ్జింగ్‌ కార్ప్‌, హైటెక్‌ గేర్‌, డీబీఎల్‌, సిల్‌, వైభవ్‌, టేక్‌, ఎస్‌టీసీ, సోరిల్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, ఏషియన్‌ టైల్స్‌, ఐఎస్‌ఎఫ్‌టీ, ఆర్‌పీపీ ఇన్ఫ్రా తదితరాలు 8-5 శాతం మధ్య జంప్‌ చేశాయి.Most Popular