జెట్‌ ఎయిర్‌- కల్పతరు.. దూకుడు

జెట్‌ ఎయిర్‌- కల్పతరు.. దూకుడు

స్టేట్‌బ్యాంక్‌ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం కంపెనీలో మెజారిటీ వాటాను తీసుకోనుండటం, ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకోవడం వంటి సానుకూల అంశాల నడుమ వరుసగా రెండో రోజు విమానయాన సేవల కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క స్వీడిష్‌ ఈపీసీ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇతర వివరాలు చూద్దాం...

జెట్‌ ఎయిర్‌వేస్‌
జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను 11.4 కోట్ల ఈక్విటీ షేర్లుగా రుణదాత సంస్థలు మార్పిడి చేసుకోనున్నాయి. అంతేకాకుండా కంపెనీకి రూ. 1500 కోట్ల అదనపు రుణాలను మంజూరు చేయనున్నాయి. తద్వారా కంపెనీ కార్యకలాపాలను గాడిన పెట్టే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. మరోవైపు ప్రమోటర్ నరేష్‌ గోయల్‌, విదేశీ భాగస్వామి ఎతిహాద్‌కు కంపెనీలో ఉన్న వాటాలు తగ్గనున్నాయి. అంతేకాకుండా తదుపరి కాలంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు కంపెనీలో వాటాను రుణదాత సంస్థలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం 15 శాతంపైగా దూసుకెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 9 శాతం జంప్‌చేసి రూ. 276 వద్ద ట్రేడవుతోంది.

Image result for kalpataru power transmission ltd

కల్పతరు పవర్‌
విద్యుత్‌ ప్రసారం, పంపిణీ తదితర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ కల్పతరు పవర్‌ స్వీడిష్‌ ఈపీసీ సంస్థలో 85 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 2.4 కోట్ల డాలర్లను(సుమారు రూ. 160 కోట్లు) వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కల్పతరు పవర్‌ షేరు 3 శాతం ఎగసి రూ. 448 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 453 వరకూ జంప్‌చేసింది.Most Popular