అరవింద్‌ హైజంప్‌- ఐపేపర్‌ పతనం

అరవింద్‌ హైజంప్‌- ఐపేపర్‌ పతనం

టెక్స్‌టైల్స్‌ సంస్థ అరవింద్‌ లిమిటెడ్‌ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి ఇటీవలే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన అరవింద్‌ ఫ్యాషన్స్ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా 10వ రోజు ఈ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఇక మరోపక్క సాధారణ నిర్వహణలో భాగంగా రాజమండ్రి ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించడంతో ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎం కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ఇతర వివరాలు చూద్దాం..

అరవింద్‌ ఫ్యాషన్స్‌
ప్రత్యేక కంపెనీగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక లాభాల దౌడు తీస్తున్న అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరు మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం జంప్‌చేసింది. రూ. 1058.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం కాగా.. ఈ నెల 8న రూ. 590 వద్ద లిస్టయిన ఈ షేరు ఇప్పటివరకూ 79 శాతం ర్యాలీ చేయడం విశేషం! అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో టెక్స్‌టైల్‌ బ్రాండ్లు, రిటైల్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా లాల్‌భాయ్‌ గ్రూప్‌ సంస్థ అరవింద్‌ లిమిటెడ్‌ విడదీసింది. దీనిలో భాగంగా అరవింద్‌ లిమిటెడ్‌ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 5 షేర్లకుగాను 1 అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరుని కేటాయించిన విషయం విదితమే. 

Image result for international paper appm ltd

ఇంటర్నేషనల్ పేపర్‌
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలోగల పేపర్‌ తయారీ యూనిట్‌ను నిర్వహణ కోసం ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎం తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి 30 వరకూ నిర్వహణ పనుల కోసం ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియజేసింది. దీంతో రోజుకి 500 టన్నులమేర పేపర్‌ తయారీకి విఘాతం కలగనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇంటర్నేషనల్‌ పేపర్‌ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 438 వద్ద ట్రేడవుతోంది.  Most Popular