టీటీకే ప్రెస్టేజ్‌ జూమ్‌- దివాన్‌ డౌన్‌

టీటీకే ప్రెస్టేజ్‌ జూమ్‌- దివాన్‌ డౌన్‌

వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో కిచెన్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ టీటీకే ప్రెస్టేజ్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ కౌంటర్ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క రేటింగ్ దిగ్గజం క్రిసిల్‌ కంపెనీ జారీ చేసిన కమర్షియల్‌ పేపర్స్‌(డెట్‌ సెక్యూరిటీస్‌) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడికావడంతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం...

టీటీకే ప్రెస్టేజ్‌ 
వాటాదారులకు ఫ్రీగా షేర్లను జారీ చేసేందుకు వీలుగా బోనస్‌ ఇష్యూకి ప్రతిపాదించినట్లు టీటీకే ప్రెస్టేజ్‌ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 29న సమావేంకానున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీటీకే ప్రెస్టేజ్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 8143 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 8189 వరకూ ఎగసింది.

Related image

దివాన్‌ హౌసింగ్‌ 
రేటింగ్ దిగ్గజం క్రిసిల్‌ కంపెనీ జారీ చేసిన కమర్షియల్‌ పేపర్స్‌(డెట్‌ సెక్యూరిటీస్‌) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడికావడంతో దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్‌ అమ్మకాలతో డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 2.3 శాతం క్షీణించి రూ. 131 దిగువన ట్రేడవుతోంది. రూ. 850 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్ రేటింగ్‌ను క్రిసిల్‌ A1 నుంచి A2+ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు దివాన్‌ హౌసింగ్‌ పేర్కొంది.Most Popular