ఈ స్టాక్స్‌ను గమనించండి... (మార్చి 25)

ఈ స్టాక్స్‌ను గమనించండి... (మార్చి 25)
 • మ్యాక్స్‌ ఇండియా కొత్త చైర్మన్‌గా అనల్జిత్‌ సింగ్‌ నియామకం
 • బాసెల్‌-3 బాండ్ల జారీ ద్వారా రూ.1,251.30 కోట్లు సమీకరించిన ఎస్‌బీఐ
 • రూ.20వేల కోట్ల ఈక్విటీ మూలధనం సేకరించడానికి అనుమతించిన ఎస్‌బీఐ బోర్డు
 • ఎవోక్‌ కాపీ కేసుకు సంబంధించి చైనా కోర్టులో కేసు గెలిచిన జేఎల్‌ఆర్‌, టాటామోటార్స్‌ షేర్‌పై ప్రభావం చూపే ఛాన్స్‌
 • హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ యూనిట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని ఫామ్‌ 483 జారీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలో 10 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసిన ఇన్ఫోసిస్‌
 • వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా1.6 మిలియన్ల లామినేట్‌ షీట్లకు పెంచేందుకు అంగీకరించిన గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు
 • రైట్స్‌ ఇష్యూ ద్వారా ఐటీ సంస్థలో వాటాను 94.12 శాతానికి పెంచుకున్న రాంకో సిమెంట్స్‌
 • సిడ్వాల్‌ రిఫ్రిజరేషన్‌ ఇండస్ట్రీస్‌లో వాటాను 80 శాతం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
 • పారీ షుగర్స్‌ రిఫైనరీలో రూ.70 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఈఐడీ ప్యారీ బోర్డు
 • టాటా కాఫీ కొత్త ఎండీ, సీఈఓగా చకో పురక్కాల్‌ నియామకం, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నియామకం
 • మార్చి 29న జరిగే బోర్డు మీటింగ్‌లో బోనస్‌ ఇష్యూ జారీపై నిర్ణయం తీసుకోనున్న టీటీకే ప్రెస్టీజ్‌
 • టాటాస్టీల్‌కు రూ.6700 కోట్ల విలువైన రెడిమబుల్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లను కేటాయించనున్న టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌
 • మెయింటనెన్స్‌ కోసం ఇవాళ్టి నుంచి  మార్చి 30 వరకు రాజమండ్రి ప్లాంట్‌లో ఉత్పత్తిని ఆపివేయనున్న ఇంటర్నేషనల్‌ పేపర్‌
 • వచ్చేనెల నుంచి ప్యాసింజర్‌ వాహనాలపై ధరలను రూ.25వేల వరకు పెంచనున్న టాటామోటార్స్‌
 • టాటా పవర్‌ స్ట్రాటజిక్‌ ఇంజినీరింగ్‌ డివిజన్‌ నుంచి రూ.1200 కోట్ల ఆర్డరును దక్కించుకున్న టాటా పవర్‌
 • ఎలర్జీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అజెలాస్టైన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అలెంబిక్‌ ఫార్మాకు అనుమతులు
 • జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెక్స్‌కు షాకింగ్‌ న్యూస్‌
 • మైసూర్‌లోని జుబిలెంట్ ప్లాంట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ నియంత్రణపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్‌
 • మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే లురాసిడోన్‌ హైడ్రోక్లోరైడ్‌ ట్యాబ్లెట్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి పొందిన జైడస్‌ కేడిలా
 • ఈ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండు కింద ప్రభుత్వానికి చెక్కులను అందజేసిన పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఈసీ
 • ప్రభుత్వానికి పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ రూ.1,629.62 కోట్లు, ఆర్‌ఈసీ రూ.1,143.34 కోట్ల చెక్కుల అందజేత
 • అమెరికా మార్కెట్లోకి లెవోథైరాక్సిన్‌ సోడియమ్‌ జెనరిక్‌ ట్యాబ్లెట్స్‌ను విడుదల చేసిన లుపిన్‌


Most Popular