స్టార్టప్ ఫండింగ్ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపు...!

స్టార్టప్ ఫండింగ్ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపు...!

స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఎంజిల్ ఇన్వెస్టర్లకు ఆదాయపు పన్ను శాఖ వరాలను కురిపించింది. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తాజాగా వెల్లడించిన సమాచారం మేరకు ఎంజిల్ ఇన్వెస్టర్ల ద్వారా ఫండింగ్ పొందిన సుమారు 120 స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపును వర్తింపజేసింది. గత ఫిబ్రవరిలో మొదలు పెట్టిన నూతన విధానం కింద ఈ స్టార్టప్‌ కంపెనీలకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు I-T శాఖ తెలిపింది. ఈ చర్యతో ఇప్పటికే పలు ఇన్‌ కం ట్యాక్స్ సమస్యలను ఎదుర్కొంటున్న స్టార్టప్‌ కంపెనీలకు వెసులుబాటుగా మారింది. గతంలో ఈ కంపెనీలు ఎగవేత వ్యతిరేక నియమం క్రింద ఇన్‌ కం ట్యాక్స్ చట్ట ప్రకారం సమస్యలను ఎదుర్కొన్నాయి. కంపెనీ విలువ కంటే ప్రమీయం షేర్ వాల్యూ అధికంగా ఉన్న స్టార్టప్ కంపెనీలకు ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు వెళ్ళాయి. ఇప్పుడు ప్రకటించిన ట్యాక్స్ రిలీఫ్ ద్వారా ఈ సమస్యను అధిగమించినట్టైంది. 

Image result for startups angel tax
మార్చ్ నాటికి దాదాపు 150 కంపెనీలు తమను స్టార్టప్‌ కంపెనీలుగా గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖకు అర్జీలు పెట్టుకున్నాయి. వీటిలో 120 కంపెనీలకు ట్యాక్స్ రిలీఫ్‌ను ఈ విధానం ద్వారా ప్రకటించారు. మిగతా కంపెనీలు కూడా తమ అప్లికేషన్స్ ను సవరించి పంపినట్టైతే.. వారికి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అందుతాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు.  ఈ పన్ను మినహాయింపు గరిష్టంగా 10 సంవత్సరాల పాటు ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

Image result for startups angel taxImage result for startups angel tax
ఇలా పన్ను మినహాయింపు విధానం వల్ల దేశంలోని సంపన్న వ్యక్తులు స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహక కరంగా ఉంటుందని భావిస్తున్నారు. స్టార్టప్ కంపెనీల ఇన్నోవేటివ్ వ్యాపారానికి ఈ పెట్టుబడులు దన్నుగా నిలుస్తాయి కాబట్టి వ్యాపార విస్తరణకు స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్  సెక్షన్ 56(2) (viib) కింద ఈ షేర్ ప్రమీయం మినహాయింపు వర్తించబోతున్నట్టు ఆదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
 Most Popular