విస్తరణపై దృష్టిపెట్టిన ఇండిగో, త్వరలో కొత్త విమానాల కొనుగోలు

విస్తరణపై దృష్టిపెట్టిన ఇండిగో, త్వరలో కొత్త విమానాల కొనుగోలు

సేవలను విస్తరించేందుకు మరిన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది ఇండిగో. మయమ్మార్‌, వియత్నాం, సౌదీ అరేబియా, చైనాలకు సర్వీసులను ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నెలరోజులుగా పైలెట్ల కొరత, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. అయితే రాబోయే రోజుల్లో ఈ సమస్య తలెత్తకుండా ఇండిగో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కొత్తగా ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది కాలంలో కొత్తగా 25 ఎయిర్‌బస్‌ A321 నియో విమానాలను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. అన్ని అనుకూన్న సమయానికి జరిగితే వచ్చే 12 నెలల్లో 220 సీటింగ్‌ సామర్థ్యంగల 15 విమానాలను సిద్ధం అవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. 

త్వరలో అంతర్జాతీయ విమానసర్వీసులను ఈ సంస్థ విస్తరించనుంది ఇండిగో. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 48 విమానాలను తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.15 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను సుదూర ప్రాంతాలకు అంటే యూరోప్‌ దేశాలైన యూకే, కామన్‌వెల్త్‌ దేశాలకు నడిపే అవకాశం ఉంది. అలాగే దేశంలోని రద్దీ రూట్లు అయిన ఢిల్లీ, ముంబాయిల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ తెలిపారు. సర్వీసుల విస్తరణకు సంబంధించి సర్టిఫికెట్లు, అనుమతులు తీసుకునే ప్రక్రియలో ఉన్నట్టు, ఏప్రిల్‌-అక్టోబల్‌ మధ్యలో చైనాకు సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు బౌల్టర్‌ తెలిపారు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు ప్రస్తుతం రోజుకో సర్వీసును నడుపుతున్నామని, ఈ నెల తర్వాత నుంచి రెండో సర్వీసును కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

గత నెల రోజులుగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పైలెట్ల కొరతతో ఇండిగో దాదాపు 30 విమానాలను రద్దు చేసింది. దీంతో ఇండిగో నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త పైలెట్ల నియామకంపై దృష్టిపెట్టింది. కొత్త పైలెట్లతో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోన్న అనుభవం కలిగిన పైలెట్లను రిక్రూట్‌ చేసుకోవాలని ఇండిగో నిర్ణయించింది. Most Popular