ఒక్క నెలలోనే 30-99 శాతం ర్యాలీ చేసిన 30 స్టాక్స్ ఇవే..!! మీ దగ్గరున్నాయా?

ఒక్క నెలలోనే 30-99 శాతం ర్యాలీ చేసిన 30 స్టాక్స్ ఇవే..!! మీ దగ్గరున్నాయా?

గత 15 రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్లిష్ ర్యాలీని కొనసాగించాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ప్రవాహాన్ని మార్కెట్లలోకి మళ్ళించడం, రానున్న ఎన్నికల ఫలితాలపై సర్వేల ఊహాగానాలు మార్కెట్లను పుంజుకునేలా చేశాయి. BSE 500 ఇండెక్స్  ఒక్కనెలలోనే దాదాపు 9శాతం వృద్ధిని కనబరిచింది. ఇందులోని 30 స్టాక్స్  30శాతం నుండి 99 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. లాభాలను నమోదు చేసిన ఈ స్టాక్స్ లోని కొన్ని గత సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అత్యంత కనిష్టానికి పడిపోయినవి కూడా ఉన్నాయి. కార్పోరేట్ గవర్నెన్స్ ఇష్యూస్‌, లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొన్న కొన్ని స్టాక్స్ ఈ మార్చ్‌లో వేగంగా పుంజుకోడాన్ని మనం గమనించవచ్చు. 
ఒక్క నెలలోనే సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్స్  దాదాపు 98.58శాతం పెరిగింది.  దిలీప్ బిల్డ్ కాన్, ఎడిల్‌వీజ్ ఫిన్, CG పవర్, బోంబే డైయింగ్ , అదానీ పవర్, అలహాబాద్ బ్యాంక్, మహీంద్ర హాలిడేస్, NBCC, IRB ఇన్ఫ్రా, జస్ట్ డయల్, ICICI సెక్యూరిటీస్ , కల్పతరు పవర్ , కెన్‌ ఫిన్ హోమ్స్, వంటి స్టాక్స్ ఈ మార్చ్‌లో మంచి ప్రాఫిట్స్ ను అందించాయి. 

pic courtesy by: Ace Equity

pic courtesy by: Ace Equity
భారత దేశంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం కనుక ఏర్పడితే.. విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) దేశీయ మార్కెట్లలో భారీ ఎత్తున రికార్డ్ స్థాయిలో పెట్టుబడులను పెంచనున్నట్టు ఇండియా బుల్స్ వెంచర్స్ భావిస్తోంది. మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాల్లో కొనుగోళ్ళ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని , ఎన్నికల అనంతరం మార్కెట్ సూచీలు రికార్డ్ స్థాయికి మించి నమోదు అవుతాయని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 
ఈ మార్చ్‌లో నిఫ్టీ 50లో టాప్‌ ఫోర్‌లో నిలిచిన స్టాక్స్ PSU సెగ్మెంట్‌కు చెందినవే. HPCL 35శాతం, IOC 29శాతం, BPCL 21శాతం, NTPC 21శాతం పెరిగాయి. బ్యాంకింగ్ సెక్టార్‌లో టాప్‌ 5 లో  ఎస్ బ్యాంక్, బజాజ్ ఫిన్, ఇండస్‌ ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్ , SBI లు 15 శాతం నుండి 17శాతం లాభాలను నమోదు చేసాయి. 

 

DISCLAIMER: పైన పేర్కొన్న సూచనలు, సలహాలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టుల చే సూచించబడినవి. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.Most Popular