ఆఖరి గంటలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఈ ఫండ్స్ చూడండి

ఆఖరి గంటలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఈ ఫండ్స్ చూడండి

ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సాధారణ జనాలకు దీనితో పెద్దగా పనిలేదు కానీ ఉద్యోగులు, బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు మాత్రం ఇదో మేజర్ డేట్. ఎందుకంటే పన్నులు చెల్లించడానికి, ట్యాక్స్‌ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన పెట్టుబడులకు తేదీ దగ్గర పడ్తోంది. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్ను ఆదా చేసుకునేందుకు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మందికి తెలుసు. దీంతో పాటు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంకుల్లో ఐదేళ్ల ఫిక్సెడ్ డిపాజిట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మీడియం రిస్క్‌తో బెస్ట్ రిటర్న్స్‌ ఇచ్చే అవకాశం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మాత్రమే ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వీటికి లాక్ ఇన్ పీరియడ్ కూడా మూడేళ్లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌తో పోలిస్తే తక్కువ లాకిన్ పీరియడ్ ఉన్నది వీటికే. 

రూ.46,800 ఆదా చేసుకోవచ్చు
సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు. దీంతో  ఆర్థిక సంవత్సరంలో రూ.46800 వరకూ పన్నును ఆదా చేసుకునేందుకు వీలుంది. అందుకే మీరు ఏమైనా ఆఖరి నిమిషంలో ఇలాంటి ప్లాన్స్ తీసుకునే ఆలోచన ఉంటే వీటిని పరిగణలోకి తీసుకోవచ్చు. మరింత స్పష్టమైన ప్రణాళిక కావాలంటే మీ దగ్గర్లోని ఫైనాన్షియల్ ప్లానర్ సలహాలు కూడా తీసుకోవచ్చు. 
గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం  ఏంటంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా మూడేళ్లు ఖచ్చితంగా ఆగాల్సిందే. 

ఈ ఫండ్స్ పనితీరు బాగుంది
అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ సహా మూడేళ్ల యావరేజ్ రిటర్న్స్‌ను పరిగణలోకి తీసుకుని చూస్తే ఓ ఐదు ఫండ్స్ బాగా పనితీరును కనబరుస్తున్నాయి. వాటిల్లో మిరే అసెట్ ట్యాక్స్ సేవర్, మోస్ట్ ఫోకస్డ్ లాంగ్ టర్మ్, హెచ్ డి ఎఫ్ సి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్, ప్రిన్సిపుల్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, టాటా ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఉన్నాయి. ఇవి యాభై శాతానికిపైగా రిటర్న్స్‌ను గత మూడేళ్ల కాలంలో ఇచ్చాయి. 

ఫండ్ పేరు            
1. మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్
2. మోస్ట్ ఫోకస్డ్ లాంగ్ టర్మ్
3. హెచ్ డి ఎఫ్ సి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్
4. ప్రిన్సిపుల్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్
5. టాటా ట్యాక్స్ సేవింగ్ ఫండ్

నోట్ - ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడులు పెట్టేముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. 


 Most Popular