రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్ ఇప్పుడు కొనొచ్చా ? అమ్మాల్సిన టైం వచ్చిందా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్ ఇప్పుడు కొనొచ్చా ? అమ్మాల్సిన టైం వచ్చిందా

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ గత కొద్ది రోజులుగా దూసుకుపోతోంది. హెవీ వెయిట్ లార్డ్ క్యాప్ స్టాక్ అయినప్పటికీ స్టాక్ పరుగులు తీస్తోంది. రూ.1500 మార్కుకు అతి త్వరలో చేరబోతోందనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఉంటే.. కొంత మంది ఎనలిస్టులు మాత్రం ఇది అమ్ముకుని బయటపడాల్సిన టైమ్ అంటూ తేల్చేస్తున్నారు. ఇంతకీ ఏంటి వీళ్ల స్ట్రాటజీ. రిలయన్స్‌ను ఈ టైంలో బయ్, సెల్ ఆర్ హోల్డ్.. ఏం చేయాలి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యం పెట్రో, రిఫైనరీ, కెమికల్స్, రిటైల్, టెలిఫోన్ రంగాల్లో భారీగా విస్తరించిందని అందరికీ తెలిసిందే. 2008 తర్వాత ఈ స్టాక్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. సుమారు ఏడెనిమదేళ్ల పాటు విపరీతమైన కన్సాలిడేషన్‌ను చవిచూసిన స్టాక్ గతేడాది నుంచి తేరుకుంది. జియో దెబ్బతో కొండెక్కి కూర్చుంది. ఈ స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 22.7 శాతం రిటర్న్స్‌ను అందించింది. ఇదే సమయంలో సెన్సెక్స్ ఇచ్చిన లాభాలు 6.4 శాతం మాత్రమే. మార్చి 20వ తేదీన రిలయన్స్ స్టాక్ రూ.1386 మార్కును టచ్ చేసింది. 

రాయిటర్స్ ఏం చెబ్తోంది
థామ్సన్ రాయిటర్స్ వివిధ రీసెర్చ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌ను క్రోడీకరించింది. వాటి ప్రకారం 10 మంది స్ట్రాంగ్ బయ్, 16 మంది బయ్, 5 గురు హోల్డ్ రేటింగ్స్ ఇచ్చారు. ఇద్దరు మాత్రం సెల్ అని, మరో ఇద్దరు స్ట్రాంగ్ సెల్ అనే రేటింగ్‌ను రిలయన్స్‌కు ఇచ్చారు. 

తాజాగా హెచ్ ఎస్ బి సి సెక్యూరిటీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు బయ్ రేటింగ్ ఇచ్చి స్టాక్ టార్గెట్‌ను రూ.1500కు పెంచింది. 
గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లలో క్షీణత వల్ల ఎనలిస్టులకు కొద్దిగా భరోసా తగ్గుతోంది. వీటికి తోడు నాన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు 55-60 శాతం వరకూ ఉన్నాయి. కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం ఎబిటాలో 25 శాతమే ఉంటోంది. 
రిలయన్స్ రిటైల్, జియో డివిజన్లు ఇప్పటికీ వర్టికల్ గ్రోత్‌ను నమోదు చేస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మంచి రెవెన్యూ జనరేటర్స్ అవుతాయని హెచ్ ఎస్ బి సి సెక్యూరిటీస్ లెక్కగడ్తోంది. 

వేల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ?
రూ.950-1000 స్థాయిల నుంచి అత్యంత వేగంగా స్టాక్ పెరగడంతో ఇక్కడ కొద్దిగా రిస్కీ బెట్ అనిపిస్తోందనేది అధిక రీసెర్చ్ సంస్థల మాట. ఫ్రెష్ బయింగ్‌కు కాస్త బ్రేక్ వేసి, హోల్డ్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రూ. 1450-1500 మధ్య ప్రాఫిట్ బుకింగ్‌కు కూడా ఆస్కారం ఉంటుందని, ఆ స్థాయికి వెళ్లిన తర్వాత వేల్యుయేషన్ పాయింట్‌లో కొద్దిగా రిస్కీ అవుతుందని వివరిస్తున్నారు. Most Popular