కన్సాయ్‌ డీలా- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ఖుషీ

కన్సాయ్‌ డీలా- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ఖుషీ

విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం సీఎల్‌ఎస్‌ఏ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పెయింట్ల రంగ బ్లూచిప్‌ కన్సాయ్‌ నెరోలాక్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ షేరు కళతప్పగా.. అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ARCIL)లో వాటా విక్రయించినట్లు వెల్లడించడంతో ఫైనాన్షియల్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కదులుతోంది. వివరాలు చూద్దాం...

కన్సాయ్‌ నెరోలాక్
విదేశీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ షేరుని విక్రయించవచ్చు(సెల్‌) అంటూ రేటింగ్‌ను ప్రకటించడంతో కన్సాయ్‌ నెరోలాక్‌ కౌంటర్‌ బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కన్సాయ్‌ షేరు 2.5 శాతం క్షీణించి రూ. 448 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 436 వరకూ పతనమైంది. ప్రధానంగా ఆటో రంగం వెనకడుగు వేస్తుండటంతో కంపెనీ అమ్మకాలు మందగించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఆటో రంగ దిగ్గజాల నుంచే ఆదాయంలో 45 శాతం వాటా లభిస్తున్న నేపథ్యంలో కన్సాయ్‌ నెరోలాక్‌ షేరు రేటింగ్‌ను అండర్‌పెర్ఫార్మ్‌ నుంచి సెల్‌కు సవరించినట్లు పేర్కొంది. టార్గెట్‌ ధరను రూ. 450 నుంచి రూ. 385కు తగ్గించింది. పెరుగుతున్న ముడిచమురు ధరలు సైతం కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడింది. 

Image result for IDFC First bank

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌
రుణ పునర్నిర్మాణ కంపెనీ[Arcil] ఈక్విటీ మూలధనంలో సుమారు 8.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ షేరు 2 శాతం లాభపడి రూ. 53.40 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 54 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది.Most Popular