ఫెడ్‌ ఎఫెక్ట్‌- సెన్సెక్స్‌ సెంచరీ

ఫెడ్‌ ఎఫెక్ట్‌- సెన్సెక్స్‌ సెంచరీ

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ సెంచరీ చేసింది. 38,500ను అధిగమించింది. ప్రస్తుతం 105 పాయింట్లు ఎగసి 38,492 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 34 పాయింట్లు బలపడి 11,555ను తాకింది. అందరి అంచనాలను తల్లికిందులు చేస్తూ ఫెడరల్ రిజర్వ్‌ 2019లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం టెక్‌ దిగ్గజాల అండతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, బ్యాంక్స్‌, ఆటో రంగాలు 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా 1 శాతం, ఐటీ 0.4 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌, ఐబీ హౌసింగ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, ఐషర్, యస్‌ బ్యాంక్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.6-0.4 శాతం మధ్య క్షీణించాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో కావేరీ సీడ్‌, జెట్‌ ఎయిర్‌, ఇన్ఫీబీమ్‌, జస్ట్‌డయల్‌, ఐజీఎల్‌, ఎన్‌సీసీ, పెట్రోనెట్‌ 3.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఆర్‌ఈసీ, జేపీ, ఐడియా, ఐసీఐసీఐ ప్రు, హెక్సావేర్‌, ఒరాకిల్‌, మైండ్‌ట్రీ, డీఎల్‌ఎఫ్‌ 2.2-0.8 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ప్లస్‌
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 841 లాభపడగా.. 504 నష్టాలతో కదులుతున్నాయి.Most Popular