టెక్‌ దిగ్గజాల దన్ను- యూఎస్‌ అప్‌

టెక్‌ దిగ్గజాల దన్ను- యూఎస్‌ అప్‌

అందరి అంచనాలను తల్లికిందులు చేస్తూ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో శుక్రవారం ఉన్నట్టుండి ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. గురువారం బాండ్ల ఈల్డ్స్‌తోపాటు.. బ్యాంకింగ్‌ దిగ్గజాలు డీలాపడటంతో మార్కెట్లు బలహీనపడినప్పటికీ వారాంతాన తిరిగి జోరందుకున్నాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ అధ్యక్షతన టెక్‌ దిగ్గజాలు పుంజుకోవడంతో మార్కెట్లు పురోగమించాయి. డోజోన్స్‌ 217 పాయింట్లు(0.85 శాతం) పెరిగి 25,962కు చేరగా.. ఎస్‌అండ్‌పీ సైతం 31 పాయింట్లు(1.1 శాతం) బలపడి 2,855 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 110 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 7,839 వద్ద స్థిరపడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న 2.25-2.5 శాతం ఫండ్స్‌ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే నిర్ణయించింది. అయితే ఇప్పటివరకూ చెబుతున్నట్లు 2019లో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చంటూ సంకేతాలివ్వడం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

టెక్‌ ఇండెక్స్‌ జోరు
టెక్‌ బ్లూచిప్స్‌లో యాపిల్‌ ఇంక్‌ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 195 డాలర్లను తాకింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్‌ 2.3 శాతం పుంజుకోగా.. వెస్టర్న్‌ డిజిటల్‌ 10 శాతం, మైక్రాన్‌ టెక్నాలజీ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. అంచనాలను అధిగమిస్తూ పటిష్ట పనితీరు ప్రదర్శించడంతో కోనాగ్రా ఫుడ్స్‌ 13 శాతం జంప్‌చేసింది. అయితే అల్జెమీర్స్ వ్యాధి చికిత్సకు రూపొందిస్తున్న ఔషధం చివరి దశ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో బయోజెన్‌ ఇంక్‌ 29 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో మాన్‌స్టర్ బెవరేజ్‌ 4 శాతం పతనంకాగా.. జేపీ మోర్గాన్‌, వాల్ట్‌డిస్నీ, బోయింగ్‌ కంపెనీ 1.6-1 శాతం మధ్య డీలాపడ్డాయి. మరోవైపు ఐపీవో పూర్తిచేసుకున్న స్ట్రాస్‌ అండ్‌ కంపెనీ 32 శాతం ఎగసింది. ఆటో దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ 2 శాతం లాభపడింది.

ఆసియా  వీక్
ఫెడరల్‌ రిజర్వ్‌ సరళతర విధానాలు అవలంబించనున్నట్లు ప్రకటించడంతో తొలుత డీలాపడిన డాలరు ఇండెక్స్‌ కోలుకుంది. 95.73కు చేరింది. యూరో 1.137ను తాకగా.. జపనీస్‌ యెన్‌ 1110.77 వద్ద కదులుతోంది. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌ 1-0.1 శాతం మధ్య క్షీణించాయి. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌, కొరియా నామమాత్ర లాభాలతో కదులుతుంటే.. ఇండొనేసియా యథాతథంగా ఉంది.Most Popular