ఎంబసీ రీట్స్‌ ఐపీవోకు థమ్సప్‌

ఎంబసీ రీట్స్‌ ఐపీవోకు థమ్సప్‌

బెంగళూరు సంస్థ ఎంబసీ ప్రాపర్టీ చేపట్టిన తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు(REITs) పబ్లిక్‌ ఇష్యూకి దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ. 4750 కోట్ల సమీకరణ కోసం పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో భాగస్వామ్యంలో ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభమై 20న ముగిసింది. ఇష్యూకి దాదాపు 2.6 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 2.15 రెట్లు స్పందన లభించగా.. సంపన్న వర్గాలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 3.1 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ధర రూ. 299-300కాగా.. ఐపీవోకు ముందురోజు కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1743 కోట్లను సమీకరించింది. ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌, టీటీ ఇంటర్నేషనల్‌, కొటక్‌ మహీంద్రా లైఫ్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తదితర సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. ఇష్యూకి మొత్తం రూ. 5,300 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలయ్యాయి.

ఇతర వివరాలు ఇవీ
వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసిన రియల్‌ ఎస్టేట్ ఆస్తులను నిర్వహించే సంస్థలు రీట్స్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా అద్దె ద్వారా ఆదాయం సమకూరుతుంంది. కంపెనీలో ఇన్వెస్ట్‌చేసినవారికి మ్యూచువల్‌ ఫండ్‌ తరహాలో యూనిట్లను కేటాయిస్తారు. డివిడెండ్ల రూపంలో ప్రతిఫలం లభిస్తుంటుంది. దీర్ఘకాలంలో రియల్టీకి డిమాండ్‌ పుంజుకుంటే యూనిట్ల విలువకూడా పెరిగే వీలుంటుంది. 2014లో మార్కెట్ల నియంత్రణ సెబీ.. రీట్స్‌కు అనుమతించింది. కాగా.. దేశీయంగా తొలిసారి మార్కెట్లను తాకిన రీట్స్‌గా ఎంబసీ ఐపీవో నిలవనుంది. ఇతర వివరాలకు.. ఎంబసీ రీట్స్‌ ఐపీవోకు ఇన్వెస్ట్‌ చేయవచ్చా.. (IPO News)ఆర్టికల్‌ను చూడగలరు...Most Popular