ఇన్ఫోసిస్‌- పీఎన్‌బీ అప్‌- కాఫీ డే డౌన్‌

ఇన్ఫోసిస్‌- పీఎన్‌బీ అప్‌- కాఫీ డే డౌన్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 2.5 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 742 వరకూ పెరిగింది. బైబ్యాక్‌పై అంచనాలతో మంగళవారం సైతం ఈ షేరు 1.5 శాతం బలపడింది. ఆరు నెలలపాటు చేపట్టనున్న బైబ్యాక్‌లో భాగంగా ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా సొంత ఈక్విటీ షేర్లను ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 800 ధర మించకుండా 2.36 శాతం ఈక్విటీని బైబ్యాక్‌ చేయనుంది. వెరసి 10.32 కోట్లకుపైగా ఇన్ఫోసిస్‌ షేర్లను కొనుగోలు చేయనుంది.

Image result for Coffee Day Enterprises

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌
ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీలో వాటాను విక్రయించేందుకు ప్రమోటర్‌ వీజీ సిద్ధార్ద నిర్ణయించుకున్న నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం క్షీణించి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 290 వరకూ నష్టపోయింది. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 6 శాతం నీరసించింది. మైండ్‌ట్రీలో 20 శాతానికిపైగా ఉన్న వాటాను ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీకి విక్రయించేందుకు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటర్‌ సిద్ధార్ద తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Image result for punjab national bank

పీఎన్‌బీ జోరు
వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని లండన్‌లో అరెస్ట్‌ చేసినట్లు వార్తలు వెలువడటంతో పీఎస్‌యూ సంస్థ పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దృష్టి సారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 3.7 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. నీరవ్‌ మోడీ రూ. 12,000 కోట్లకుపైగా రుణాలకు సంబంధించి పీఎన్‌బీకి టోపీ పెట్టి విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే.Most Popular