బయ్‌ రేటింగ్‌.. భెల్‌- మిండా.. భలే!

బయ్‌ రేటింగ్‌.. భెల్‌- మిండా.. భలే!

విద్యుత్‌ పరికరాల పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌( బీహెచ్‌ఈఎల్‌) షేరు కొనుగోలుకి దేశీ రీసెర్చ్‌ సంస్థ ఎస్‌బీఐక్యాప్‌ సెక్యూరిటీస్‌ తాజాగా సిఫారసు చేసింది. మరోపక్క విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో ఆటో విడిభాగాల సంస్థ మిండా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
 
బీహెచ్‌ఈఎల్‌
గతంలో బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)కు ఇచ్చిన సెల్‌ రేటింగ్‌ను తాజాగా బయ్‌కు సవరించినట్లు ఎస్‌బీఐక్యాప్‌ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. షేరుకి రూ. 106 టార్గెట్‌ ధరను సైతం ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు బీహెచ్‌ఈఎల్‌ కౌంటర్‌లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భెల్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 71 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 72ను సైతం అధిగమించింది.

Image result for minda industries

మిండా ఇండస్ట్రీస్‌
ఆటో రంగ సంస్థ మిండా ఇండస్ట్రీస్‌ షేరుకి రూ. 490 టార్గెట్‌ ధరతో నోమురా తాజాగా బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. ఇది ప్రస్తుత ధరతో పోలిస్తే 42 శాతం ప్రీమియంకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మిండా ఇండస్ట్రీస్‌ షేరు 2.5 శాతం పెరిగి రూ. 353 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 363 వరకూ ఎగసింది. Most Popular