స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 20)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 20)
 • లీజుదార్లకు అద్దె చెల్లించలేకపోవడంతో ఆగిన మరో 6 జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌
 • గురుగ్రామ్‌లో అభివృద్ధి చేస్తోన్న ఓ వాణిజ్య ప్రాజెక్టులో 33 శాతం వాటాను యూఎస్‌కు చెందిన హైన్స్‌కు విక్రయించనున్న డీఎల్‌ఎఫ్‌ 
 • డైస్టఫ్‌ ప్లాంట్‌ విస్తరణ పనులను పూర్తిచేసిన బోదల్‌ కెమికల్స్‌
 • మార్చి 23న జరిగే బోర్డు మీటింగ్‌లో మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోనున్న ఓఎన్‌జీసీ
 • ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,412 కోట్ల రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన ఐఓసీ
 • 2.82లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి ఆర్తి డ్రగ్స్‌ బోర్డు డైరెక్టర్లు గ్రీన్‌సిగ్నల్‌
 • ఎన్‌సీడీల ద్వారా రూ.200 కోట్ల నిధులను సమీకరించే యోచనలో కాఫీ డే
 • హంగేరీలో 184 గదులతో మొదటి హోటల్‌ను ప్రారంభించిన కాక్స్‌ అండ్‌ కింగ్స్‌
 • మార్చి 29న జరిగే బోర్డుమీటింగ్‌లో మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోనున్న కోల్గేట్‌ పామోలివ్‌ బోర్డు
 • అస్సాంలో కొత్త స్టోర్‌ను ప్రారంభించిన వీ-మార్ట్‌ రిటైల్‌
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా రూ.4వేల కోట్ల నిధులను సమీకరించనున్న ఐడీబీఐ బ్యాంక్‌
 • ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ కొత్త ఎండీ, సీఈఓగా డా.అశుతోష్‌ రఘువంశీ నియామకానికి బోర్డు ఆమోదం
 • పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట
 • RLDAతో నెలకొన్న రూ.1034 కోట్ల వివాదం కేసులో పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ వాదనను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
 • రూ.20కోట్ల పెట్టుబడితో కరీంనగర్‌ జిల్లాలో మొక్కజొన్న కంకులు ఆరబెట్టే కేంద్రాన్ని ప్రారంభించిన కావేరీ సీడ్‌
 • సంస్థలో నెటెల్‌ ఇన్‌ఫ్రాకు అదనంగా 16.76 శాతం వాటాను బదిలీ చేసిన భారతీ ఎయిర్‌టెల్‌


Most Popular