ఇండియా షైనింగ్ ..! రేటింగ్స్ పెంచిన గోల్డ్ మన్ శాక్స్  

ఇండియా షైనింగ్ ..! రేటింగ్స్ పెంచిన గోల్డ్ మన్ శాక్స్  

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్ మన్ శాక్స్ భారతీయ స్టాక్స్ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది గత కొద్ది రోజులుగా. మార్చ్ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా పుంజుకోవడం, నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్స్‌లు 6 నెలల గరిష్టానికి తాకడం, BSE సెన్సెక్స్ 38,000 పాయింట్లు దాటడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న గోల్డ్ మన్ సాక్స్ , భారత దేశానికి ఇచ్చిన గత రేటింగ్స్ ను సవరించి, "ఓవర్ వెయిట్ " రేటింగ్స్ ను ఇచ్చింది. అంతే కాకుండా నిప్టీ కాల్ ఆప్షన్ టార్గెట్ 12 నెలల కాలానికి గానూ 12,500 పాయింట్లుగా పేర్కొంది. ఇప్పటికే నిఫ్టీ 9శాతం పెరుగుదలతో ఉండటం, రానున్న కొద్ది నెలల్లోనే  నిఫ్టీ 12000 పాయింట్లను అధిగమించవచ్చని గోల్డ్ మన్ భావిస్తొంది. 
విదేశీ ఇన్వెస్టర్లు ( FIIs) ఇప్పటికే దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ళ ర్యాలీని చేస్తున్నారు. ప్రీఎలక్షన్ ర్యాలీతో మార్కెట్లకు మద్దతు దొరికనట్టైంది. FIIలు ఈ మార్చ్ 16 నాటికి దేశీయ మార్కెట్లలో దాదాపు రూ. 21,000 కోట్లను ప్రవహింప జేశారు. ఈ నేపథ్యంలో గోల్డ్ మన్ సాక్స్ భారత దేశ రేటింగ్స్‌ను 'ఓవర్ వెయిట్ " గానూ, నిఫ్టీ టార్గెట్ 12,500పాయింట్లుగానూ నిర్ణయించింది. ఈ సంవత్సరం ఎర్నింగ్ గ్రోత్ 16శాతం ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్వార్టర్ 3 ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ప్రామాణికంగా తీసుకున్నట్టు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ పేర్కొంది. ఒక వేళ ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే కనుక ప్రస్తుతం ఉన్న ర్యాలీ కొనసాగవచ్చని, నిఫ్టీ ఇండెక్స్ లోని 29 స్టాక్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ తో మరింత ర్యాలీని చెయోచ్చని గోల్డ్ మన్ సాక్స్ పేర్కొంది. దేశంలోని సార్వత్రిక ఎన్నికల అనంతరం స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు పుంజుకోవచ్చని గోల్డ్ మన్ అంచనా. 

Image result for goldman sachsMost Popular