జైలు శిక్ష తప్పించుకున్న అనిల్ అంబానీ

జైలు శిక్ష తప్పించుకున్న అనిల్ అంబానీ

ఇప్పటికే పలు వివాదాలతో సతమతమౌతున్న ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీ కోర్టు తీర్పునకు తలవంచారు. ఎట్టకేలకు ఎరిక్ సన్ కంపెనీకి చెల్లించాల్సిన రూ. 458 కోట్ల బకాయిలను చెల్లించారు. గతంలో ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు అనిల్ అంబానీకి అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే.  మార్చ్ 19 లోగా ఎరిక్‌సన్‌ కంపెనీకి చెల్లింపులు జరపకపోతే.. జైల్లో కూర్చోవాల్సి వస్తుందని కోర్టు అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులకు తేల్చి చెప్పింది. దాంతో గత్యంతరం లేక అనిల్ అంబానీ ఈ రోజు సాయంత్రం ఎరిక్‌ సన్‌కు చెల్లింపులు చేసినట్టు ప్రకటించారు. 
గత నెల కోర్టు సెషన్స్ లో  ఎరిక్‌సన్‌కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అలాగే రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీష్‌ సేత్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా‌టెల్‌ చైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు రూ.కోటి చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నాలుగు వారాల్లోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించిన సంగతి విదితమే.  

 Most Popular