జోష్‌లో పీవీఆర్‌- దివాన్‌ హౌసింగ్‌

జోష్‌లో పీవీఆర్‌- దివాన్‌ హౌసింగ్‌

గత నెల రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం పీవీఆర్‌ లిమిటెడ్‌ కౌంటర్ మరోసారి జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తోంది. మరోపక్క ఆవంశ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించడంతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం...

పీవీఆర్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరును ప్రదర్శించడంతో పీవీఆర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. గత నెల రోజుల్లో ఈ షేరు 17 శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీవీఆర్‌ లిమిటెడ్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1690 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1701వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీవీఆర్ నికర లాభం 79 శాతం జంప్‌చేసి రూ. 52 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 53 శాతం ఎగసి రూ. 857 కోట్లకు చేరింది. బ్రోకింగ్‌ సంస్థ ఎలారా కేపిటల్‌ ఎక్యుములేట్‌ రేటింగ్‌తో పీవీఆర్‌కు రూ. 1825 టార్గెట్‌ ధరను ప్రకటించింది.  

Image result for dewan housing limited

దివాన్‌ హౌసింగ్‌
ఆవంశ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లోగల 30.63 శాతం వాటాను విక్రయించనున్నట్లు దివాన్‌ హౌసింగ్‌ వెల్లడించింది. వార్‌బర్గ్‌ పింకస్‌, కేదార పార్టనర్స్‌, సీఎక్స్‌ పార్టనర్స్‌ తదితర పీఈ సంస్థలు వాటాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీవీఆర్‌ లిమిటెడ్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 137 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 140 వరకూ ఎగసింది.Most Popular