ప్రముఖ బ్రోకింగ్ సంస్థల సూచనలు ఇవే..!

ప్రముఖ బ్రోకింగ్ సంస్థల సూచనలు ఇవే..!

నేటి సోమవారం నాటి మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సన్సెక్స్ గరిష్టంగా 38000 పాయింట్లను దాటింది. అలాగే నిఫ్టీ ప్రారంభ సమయంలో 11,500 పాయింట్లను టచ్ చేసింది. మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడంతో కొనుగోళ్ళ మద్దతు మార్కెట్లకు అండగా నిలిచింది. గత కొన్ని రోజులుగా మార్కెట్లు మాసివ్ గ్రోత్‌ను కనబరచడంతో స్టాక్స్ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. చాలా స్టాక్స్ మంచి  అప్ ట్రెండ్‌లో ఉన్నందున ఇప్పుడు స్టాక్స్ ఎంపిక సరికాదని చాలా మంది ఇన్వెస్టర్లు భయపడుతుంటారు. కానీ..ఇది సరైన ఆలోచన కాదని, దీర్ఘకాలిక ఇన్వెస్ట్ మెంట్ కోసం ఇది సరైన సమయమని బ్రోకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. స్టాక్స్ ధర మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోడం మొదలు పెడితే తిరిగి మార్కెట్లు కుప్పకూలుతాయన్న భయం మదుపర్లకు ఎప్పుడూ ఉంటుంది. కానీ.. దీర్ఘకాలికంలో ఆయా స్టాక్స్ మరింత లాభాలను తీసుకువస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పోర్ట్ ఫోలియోను విభిన్నంగా తీర్చిదిద్దుకుంటే .. దీర్ఘకాలిక లాభాలు కనబడతాయని వారు పేర్కొంటున్నారు.  
సార్వత్రిక ఎన్నికల ప్రభావం, ఫలితాల తరువాత స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సర్వేల రిజల్ట్‌ , విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం , డాలర్ తో పోలిస్తే..రూపీ బలపడటం వంటి కారణాలతో మార్కట్లు సానుకూల ధృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 7శాతం వృద్ధితో దాదాపు 2,200 పాయింట్ల ర్యాలీని చేసింది. నిఫ్టీ కూడా 648 పాయింట్ల వృద్ధితో 11,500 పాయింట్లను టచ్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. 
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత 15 రోజుల్లో దేశీయ మార్కెట్లలో రూ. 19,000 కోట్ల పెట్టుబడులను ప్రవహింపజేశారు. 
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇదే సరైన సమయం!
ప్రస్తుతం ఉన్న పోర్ట్ ఫోలియోలను సవరించుకుంటూ.. మంచి కంపెనీల స్టాక్స్ ను ఎంపిక చేసుకోగలిగితే.. రానున్న సంవత్సర కాలంలో అవి మంచి రిటర్న్స్ ను అందిస్తాయని ప్రముఖ బ్రోకింగ్, ఫైనాన్షియల్ ఎడ్వైజ్ కంపెనీలు పేర్కొంటున్నాయి. రూ. 10 లక్షల రూపాయిలను ఫండింగ్‌గా తీసుకుంటే.. అందులో నుంచి వివిధ మార్కెట్ రంగాల్లో పెట్టుబడులను ఈ విధంగా పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు.

Dinesh

Pic Courtey by Money control
ప్రస్తుత మార్కెట్ల వృద్ధి నేపథ్యంలో ఉన్న 10 లక్షల కార్పస్ నుండి 40శాతం వరకూ నాణ్యమైన లార్జ్ క్యాప్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని, 10శాతం వరకూ  స్మాల్ , మిడ్ క్యాప్ లోని మంచి వాల్యూషన్స్ ఉన్న స్టాక్స్ మీద పెట్టుబడులు పెట్టాలని, మిగిలిన వాటిలో 30-40శాతం రుణ రంగంలోనూ, 10శాతం నిధులు బంగారం, లేదా గోల్డ్ బాండ్ల మీద పెట్టాలని  '5nance .కాం' ఫౌండర్ &CEO దినేష్ రోహిరా సూచిస్తున్నారు. 

Shivndra

Pic Courtey by Money control
అవిఘ్న ట్రేడర్స్ అంచనా ప్రకారం ఉన్న కార్పస్ రూ. 10 లక్షల నుండి 60-70శాతం నిధులలో 50శాతం లార్జ్ క్యాప్ రంగంలోనూ , 30శాతం  మిడ్ క్యాప్ ఈక్విటీస్ లోనూ, 10శాతం స్మాల్ క్యాప్ రంగంలోనూ , మిగతా 10శాతం డివిడెంట్ ఆధారిత స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టాలని సూచిస్తుంది. మిగిలిన 30శాతం ఫండ్స్ ను 20శాతం బాండ్ మార్కెట్ల మీద, 10శాతం  నెలవారి రికరింగ్ స్కీమ్స్ మీద పెట్టుబడులు పెట్టాలని అవిఘ్నా ట్రేట్స్ ఫౌండర్ & మేనేజింగ్ పార్టనర్  శివేంద్ర ఫౌజూదార్ పేర్కొంటున్నారు. 

Shivndra 2

Pic Courtey by Money control
WGC వెల్త్ సంస్థకు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌ మెంట్ ఆఫీసర్ రాజేష్ చెరువు అంచనాల ప్రకారం పోర్టో ఫోలియోలో ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కం రెండు రంగాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో లార్జ్ , మిడ్ క్యాప్, వృద్ధి చెందుతున్న ఈక్విటీస్  మీద పెట్టుబడులను పెట్టాలని,  ఫిక్స్ ఇన్‌కం కింద లిక్విడ్ నగదు, ఆర్బిట్రేజ్ , ఓవర్ నైట్ ఫండ్స్ మీద పెట్టుబడులు, గోల్డ్ మీద పెట్టుబడులు దీర్ఘకాలికంలో లాభాలను తీసుకోస్తాయని రాజేష్ చెరువు సూచిస్తున్నారు. ఎమర్జింగ్ పోర్ట్ ఫోలియో నిర్మాణానికి ఇదే మంచి తరుణమని WGC వెల్త్  సంస్థ సూచిస్తోంది. 

Rajesh 1

Rajesh 2

Pic Courtey by Money control
 
Disclaimer: పైన సూచించిన సూచనలు, సలహాలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.Most Popular