ఒక్కరోజులోనే వ్యాన్ గార్డ్ రూ.1,294కోట్ల పెట్టుబడులు..! మరి ఈ 10 స్టాక్స్ మీ దగ్గరున్నాయా?

ఒక్కరోజులోనే వ్యాన్ గార్డ్ రూ.1,294కోట్ల పెట్టుబడులు..! మరి ఈ 10 స్టాక్స్ మీ దగ్గరున్నాయా?

గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ మదుపర్లు కొనుగోళ్ళతో మార్కెట్లకు మద్దతుగా నిలిచారు. సెన్సెక్స్, నిఫ్టీ గత 2018 సెప్టెంబర్ నాటి గరిష్టానికి చేరుకున్నాయి. సన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ అమెరికన్ బేస్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ వ్యాన్ గార్డ్ గ్రూప్ ఈ మార్చ్ 15 తేదీన ఒక్కరోజులోనే దాదాపు రూ. 1200 కోట్లకు పైగా దేశీయ మార్కెట్లలో పెట్టుబడులను పెట్టింది. 10 దేశీయ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసింది వ్యాన్ గార్డ్. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వెల్లడించిన సమాచారం మేరకు వ్యాన్ గార్డ్ 10 కంపెనీల స్టాక్స్ పై రూ. 1,294 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. 
ఈ 10 కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయం
ఆర్తీ ఇండస్ట్రీస్, బాటా ఇండియా, క్యాస్ట్రాల్ ఇండియా, DCB బ్యాంక్, NIIT టెక్నాలజీస్, RBL బ్యాంక్, టీమ్ లీజ్ సర్వీసెస్,  TTK ప్రెస్టీజ్ , V-గార్డ్  ఇండస్ట్రీస్ స్టాక్స్ మీద వ్యాన్ గార్డ్ తన పెట్టుబడులను పెట్టిందని స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేర్కొంది. కాగా వ్యాన్ గార్డ్ కంపెనీ తన వద్ద నున్న రూ. 2.22 కోట్ల విలువైన  యూనీటెక్ స్టాక్స్ ను మాత్రం విక్రయించడం ఇక్కడ గమనార్హం. 
Image1616032019
ఈ 10 స్టాక్స్ లో RBL బ్యాంక్ మీద రూ. రూ. 652 కోట్లును అత్యధికంగా వెచ్చించింది వ్యాన్ గార్డ్ . బాటా ఇండియా స్టాక్స్ మీద రూ. 117.05 కోట్లు, NIIT టెక్నాలజీస్ మీద రూ. 112.28 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. ఇక ఆర్తీ ఇండస్ట్రీస్ మీద రూ.59.35 కోట్లు,  క్యాస్ట్రాల్ ఇండియా స్టాక్స్ మీద రూ. 84.40 కోట్లు, V-మార్ట్ రిటైల్ మీద 40.96 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. 
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ 10 స్టాక్స్ మంచి ప్రభావం చూపవచ్చని ఇప్పటికే పలు బ్రోకింగ్ కంపెనీలు, స్టాక్ ఎనలిస్టులు పేర్కొన్నారు. రానున్న 12 కాలంలో ఈ స్టాక్స్ 20-60శాతం లాభాలను తీసుకురావొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ ఫిబ్రవరి నుండి విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) దేశీయ మార్కెట్లపై బుల్లిష్ ట్రెండ్‌ను అవలంబిస్తున్నారు. ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడనుందన్న సర్వేల కారణంగా వారు స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ళతో సందడి చేస్తున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఫిబ్రవరి, మార్చ్ నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ. 36,000 కోట్ల పెట్టుబడులను దేశీయ మార్కెట్లలో పెట్టారు. ఓవరాల్ గా ఫిబ్రవరి 22 నుండి ఈ మార్చ్ 15 వ తేదీ నాటికి  విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మొత్తం రూ. 4,323 కోట్లుగా ఉంది. 
 Most Popular