ఎంబసీ రీట్ ఐపీఓపై రాధాకిషన్ దమానీ ఆసక్తి

ఎంబసీ రీట్ ఐపీఓపై రాధాకిషన్ దమానీ ఆసక్తి

తాజాగా వచ్చిన ఎంబసీ - బ్లాక్ స్టోన్ రీట్స్ ఐపీఓపై ప్రముఖ ఇన్వెస్టర్, అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ ఆసక్తిగా ఉన్నారు. దేశంలో మొట్టమొదటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్‌గా దమానీ పెట్టుబడుల పెట్టబోతున్నారు. 

దమానీకి చెందిన బాటిల్ పామ్ ప్రైవేట్ బెనిఫిషియరీ ట్రస్ట్, గుల్మొహర్ ప్రైవేట్ బెనిఫిషియరీ ట్రస్ట్, కర్నికర్ ప్రైవేట్ బెనిఫిషయరీ ట్రస్ట్, రాయల్ పామ్ ప్రైవేట్ బెనిఫిషయరీ ట్రస్ట్ సంస్థలు రూ.160 కోట్ల విలువైన 53.36 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. 

ప్రపంచ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం బ్లాక్ స్టోన్ సహా దేశీయ సంస్థ ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఇప్పటికే రూ.1743 కోట్లను సమీకరించారు. మార్చి 18వ తేదీ నుంచి ఈ రీట్స్ ఐపీఓ ప్రారంభం కాబోతోంది. 

ఈ మొట్టమొదటి రీట్స్ ఐపీఓ ద్వారా 12.95 కోట్ల షేర్లను ఎంబసీ ఆఫర్ చేస్తోంది. ఒక్కో యూనిట్ ధరను రూ.299-300 మధ్య నిర్ణయించారు. Most Popular