ఎంఎస్‌టీసీ ఐపీఓ గడువు పొడిగింపు...

ఎంఎస్‌టీసీ ఐపీఓ గడువు పొడిగింపు...

ఆశించిన స్థాయిలో సబ్‌స్కిప్షన్‌ రాకపోవడంతో MSTC IPO ముగింపు గడువును కేంద్రం పెంచింది. ఈనెల 15తో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగియగా... ముగింపు తేదీని ఈనెల 20 వరకు కేంద్రం పొడిగించింది. ఓవరాల్‌గా 1.12 రెట్లు సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చినప్పటికీ... క్యూఐబీ విభాగంలో 79 శాతం మాత్రమే బిడ్స్‌ వచ్చాయి. హెచ్‌ఎన్‌ఐ విభాగంలో 1.69 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 1.44 రెట్లు, రిటైల్‌ విభాగంలో 2.7 రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. 

ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీలో ప్రభుత్వానికి 89.85 శాతం వాటా ఉంది. ఐపీఓ ద్వారా 25 శాతం పైగా వాటాను విక్రయించనుండటంతో ప్రభుత్వ వాటా 64.75శాతానికి తగ్గిపోనుంది. మూడు వ్యాపార విభాగాలైన ఇ-కామర్స్‌, ట్రేడింగ్‌, రీసైక్లింగ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నీ కంపెనీకి మినీ రత్న హోదా ఉంది.  
 Most Popular