30-60శాతం పెరిగిన స్టాక్స్ ఇవే..!

30-60శాతం పెరిగిన స్టాక్స్ ఇవే..!

మార్చ్ 15 వరకూ ముగసిన వారంలో దేశీయ మార్కెట్లు గణనీయమైన ఫలితాలను చూపించాయి. ముదపర్లకు , ట్రేడర్లకు ఆశ్చర్యానికి గురిచేస్తూ.. వరుస సెషన్ల ర్యాలీలతో మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ రికార్డ్ స్థాయిలో దూసుకెళ్ళగా, సెన్సెక్స్, నిఫ్టీ గత సంవత్సరం సెప్టెంబర్ తరువాత గరిష్టానికి చేరాయి. ఎన్నికల వరకూ ఇది శుభ సూచకమని, ఎన్నికల ఫలితాల తరువాత కూడా మార్కెట్లు అప్ ట్రెండ్‌ను కనబరుస్తాయని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. BSE లోని దాదాపు 60 నుండి 70 స్టాక్స్  20శాతం నుండి 60శాతం వరకూ పెరిగాయి. సెన్సెక్స్ 38,000 పాయింట్లను దాటడంలో బ్యాంకింగ్ సెక్టార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ దోహద పడ్డాయి. BSE లోని 500 కంపెనీల్లో సగానికి పైగా సుమారు 347 కంపెనీల స్టాక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. 
లాభాల బాటలో ఉన్న స్టాక్స్ 
ఆదానీ పవర్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్, అలహాబాద్ బ్యాంక్,  కల్పతరు పవర్, మణప్పురం ఫిన్, ఐనాక్స్  లీజర్ , కజారియా సిరామిక్స్  , ముత్త్హూట్ ఫిన్ వంటి కంపెనీలు దాదాపు 30- 60 శాతం  పెరిగాయి. అదానీ పవర్ అత్యధికంగా 63.5శాతం వృద్ధిని కనబరిచింది. 


నష్టాల్లో ఉన్న స్టాక్స్
మార్కెట్లు వేగంగా పుంజుకుని గత వారం పాటు వరుసగా లాభాల్లో ఉంటే... అనిల్ అంబానీకి చెందిన ఆర్ కాం , అడాగ్ , రిలయన్స్ పవర్ , రిలయన్స్ క్యాపిటల్ వంటి కంపెనీలు దాదాపు 60శాతం నష్టపోయాయి.  ఆర్ కాం స్టాక్స్ దాదాపు 73శాతం పడిపోవడం గమనార్హం. ఇక BSEలోని  ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్, దివాన్ హౌజింగ్ ఫిన్, రిలయన్స్ కమ్యునికేషన్స్, శంకర బిల్డింగ్స్, ఇండియా బుల్స్, నవకార్ కార్ప్, గ్రాఫైట్ ఇండియా, SPARC,  సెంట్రల్ బ్యాంక్, HEG, డిష్ టీవీ వంటి కంపెనీలు 40 నుండి 80శాతం వరకూ నష్టపోయాయి. వీటిలో ఇన్ఫీబీమ్  ఎవెన్యూస్ గరిష్టంగా -80.8శాతం వరకూ నష్టపోవడం గమనార్హం. 


 Most Popular