స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ!!

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ!!

గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్ బస్టర్ వారంగా చెప్పుకోవచ్చు. సెన్సెక్స్, నిఫ్టీ తమ క్యూషియల్ రెసిస్టెన్స్ లెవల్స్‌ను అధిగమించి మరీ లాభాల బాటన పయనించాయి. మార్చ్ 15 నాటికి S&P BSE సెన్సెక్స్  దాదాపు 3.69శాతం వృద్ధితో 1,353 పాయింట్ల ర్యాలీని చేసింది. అలాగే నిఫ్టీ 50 కేవలం 5 సెషన్స్ లోనే 3.5శాతం వృధ్ధిని నమోదు చేసింది. నిఫ్టీ గరిష్టంగా 11,500 పాయింట్లను తాకడం గమనార్హం. సెన్సెక్స్ కూడా 38000 పాయింట్లను రీచ్ కావడం ముదపర్లకు ఆనందం కలిగించింది. 2018 సెప్టెంబర్ 14 తరువాత BSE సెన్సెక్స్ 38,000 పాయింట్లను దాటడం ఇదే మొదటి సారి. అలాగే 2018 సెప్టెంబర్ 18 తరువాత నిఫ్టీ  11,400 పాయింట్లను దాటడం ఇది తొలిసారి.  గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల పవనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ మద్దతు వంటి అంశాలు గత వారం మార్కెట్లను దూసుకెళ్ళేలా చేశాయి. విస్తృత మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీలు అవుట్ పెర్ఫర్మెన్స్‌తో అదరగొట్టాయి. S&P BSE లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.4శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1శాతం వృద్ధిని నమోదు చేశాయి. BSE లోని 500  కంపెనీల్లో సుమారు 32 కంపెనీల స్టాక్స్  10 నుండి 20శాతం అప్ ట్రెండ్‌తో ర్యాలీని చేశాయి. ఆయా కంపెనీల కౌంటర్లు కొనుగోళ్ళ మద్దతుతో సందడిగా కనిపించాయి. వీటిలో DLF, ఫినోలెక్స్ కేబుల్స్ , IDFC, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఆదానీ ట్రాన్స్‌మిషన్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్ వంటి కంపెనీల స్టాక్స్ లాభాల ర్యాలీని చేశాయి. 
image (4)
BSE లోని మిడ్ క్యాప్ స్టాక్స్ అయిన NLC ఇండియా, ఆదానీ ట్రాన్స్, NBCC ఇండియా, ఎడిల్వీజ్ ఫిన్ , IIFL హోల్డింగ్ వంటి కంపెనీలు 10-20శాతం వరకూ ర్యాలీ చేశాయి. 
స్మాల్ క్యాప్ స్టాక్స్ అయిన ఇండోసోలార్, ABG షిప్ యార్డ్, ఆర్కిడ్ ఫార్మా, ది బైక్ హాస్పిటాలిటీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, IIFL హోల్డింగ్స్ 10 నుండి 40శాతం వరకూ ర్యాలీ చేశాయి. 

నిఫ్టీ బ్యాంక్ ఆల్‌ టైం రికార్డ్
గత వారం బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా వేగంగా పైకి ఎగిసింది.  నిఫ్టీ బ్యాంక్ ఆల్ టైం రికార్డ్‌తో 1.58శాతం వృద్ధితో 458 పాయింట్లు పెరిగి 29,520.70 వద్ద క్లోజ్‌ అయింది.  బ్యాంకింగ్ స్టాక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ , కోటక్ మహీంద్ర బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటివి లాభాల బాటలో పయనించాయి. 
డాలర్‌తో రూపీ మారకపు విలువ బలపడటం, గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు,  ఎలక్షన్‌ సర్వేలు వంటి అంశాలు మార్కెట్లను లాభాల దిశగా నడిపించాయి. రానున్న మరి కొద్ది వారాలు ఈ ట్రెండ్ కనిపించ వచ్చని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టీ , సెన్సెక్స్ సూచీలు మరిన్ని రికార్డులను నెలకొల్పనున్నట్టు వారు పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం మార్కెట్లు మరింత పుంజుకుంటాయని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. 


 Most Popular