సీజీ పవర్‌పై రుణదాతల కన్ను?

సీజీ పవర్‌పై రుణదాతల కన్ను?

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న సీజీ వపర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. తద్వారా ఫిబ్రవరిలో నమోదైన 52 వారాల కనిష్టం నుంచి 106 శాతం ర్యాలీ చేసినట్లయ్యింది. పీఈ సంస్థ కేకేఆర్‌, యస్ బ్యాంక్‌, బీవోఐ ఏఎక్స్‌ఏ తదితర సంస్థలు సీజీ పవర్‌లో నియంత్రిత(మెజారిటీ) వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు ఇందుకు ప్రధానంగా దోహదపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం...

ఫలితాలు వీక్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో గత నెల మొదట్లో సీజీ పవర్‌ షేరు పతనబాటలో సాగుతూ వచ్చింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 150 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 28 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. దీనికితోడు క్యూ3కల్లా ప్రమోటర్ల వాటాలో 95 శాతానికిపైగా తనఖాలో ఉంచినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు క్యూకట్టారు. దీంతో ఫిబ్రవరి 14కల్లా ఈ షేరు రూ. 21.40కు దిగజారింది. అయితే కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఈక్విటీని సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడుతున్న వార్తలు ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెంచినట్లు నిపుణులు తెలియజేశారు. Most Popular