సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?! 

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 21 పాయింట్లు బలపడి 11,406 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగాయి. చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. కాగా.. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా నిలవగా.. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. 

అక్కడక్కడే
వరుసగా మూడో రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి ఎక్కడివారక్కడే గప్‌చుప్‌ అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 37,755 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 2 పాయింట్లు బలపడి 11,345 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,310 పాయింట్ల వద్ద, తదుపరి 11,277 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,380 పాయింట్ల వద్ద, తదుపరి 11,416 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 28805, 28687 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని.. ఇదే విధంగా 29056, 29188 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోష్‌
నగదు విభాగంలో బుధవారం రూ. 2,722 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం మరోసారి రూ. 1483 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. కాగా.. బుధవారం రూ. 1508 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం సైతం రూ. 818 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.Most Popular