వెస్ట్‌లైఫ్‌ -ఈక్లర్క్స్‌ -కొనుగోళ్ల కిక్‌

వెస్ట్‌లైఫ్‌ -ఈక్లర్క్స్‌ -కొనుగోళ్ల కిక్‌

ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించాక జోరందుకున్న వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో భారీ లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేస్‌ సేవల సంస్థ ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ఇతర వివరాలు చూద్దాం..

వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌
గత 10 రోజులుగా ర్యాలీ చేస్తున్న మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్ల నిర్వాహక సంస్థ వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ షేరు మరోసారి హైజంప్‌ చేసింది. ప్రస్తుతం బీఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 450కు చేరింది. తద్వారా 2018 మేలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 464కు చేరువైంది. గత 10 రోజుల్లోనూ ఈ షేరు 29 శాతం లాభపడటం గమనార్హం. ప్రధానంగా ఈ ఏడాది క్యూ3(అక్టొబర్‌-డిసెంబర్‌)లో కంపెనీ చూపిన పటిష్ట పనితీరు ఇందుకు కారణమవుతోంది. నికర లాభం 76 శాతం ఎగసి రూ. 13.7 కోట్లను తాకింది. ఇకపైనా మెరుగైన ఫలితాలు సాధించనున్నట్లు యాజమాన్యం అంచనా వేయడం కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for eclerx services ltd

ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు నేడు సమావేశమైన బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ తాజాగా తెలియజేసింది. షేరుకి రూ. 1600 ధర మించకుండా రూ. 262 కోట్ల విలువైన ఈక్విటీని బైబ్యాక్‌ చేయనున్నట్లు ఈక్లర్క్స్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈక్లర్క్స్‌ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 1152 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1173వరకూ ఎగసింది.Most Popular