ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు దూకుడు

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు దూకుడు

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన జాబితాలో ఉండటంతో గతేడాది డీలాపడ్డ ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ కొత్త ఏడాదిలో దూకుడు చూపుతోంది. ఈ బాటలో మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో షేరు 5 నెలల గరిష్టాన్ని తాకింది. ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3.7 శాతం ఎగసింది. రూ. 1697కు చేరింది. వెరసి 2018 అక్టోబర్‌ 16 తరువాత గరిష్టస్థాయిలో ట్రేడవుతోంది. ఇతర వివరాలు చూద్దాం...

జోరుగా హుషారుగా
గత మూడు రోజుల్లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. గతేడాది అక్టోబర్‌ 31న నమోదైన ఏడాది కనిష్టం రూ. 1334 నుంచి 26 శాతం రికవరీ సాధించింది. వెరసి బ్యాంక్‌ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్) రూ. ట్రిలియన్‌ మార్క్‌ను మరోసారి చేరుకుంది. కాగా..  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు ఎక్స్‌పోజర్‌ ఉన్న వార్తలతో 2018 ఆగస్ట్‌- అక్టోబర్‌ మధ్య కాలంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఫలితంగా ఈ కాలంలో 34 శాతం పతనమైంది. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌లో పోటీ తక్కువకావడంతో ఇండస్‌ఇండ్‌ మెరుగైన పనితీరు ప్రదర్శించగలదని ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. దీంతో ఈ షేరుకి ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది.Most Popular