యూరప్‌ ఓకే -సెన్సెక్స్‌ ఫ్లాట్‌!

యూరప్‌ ఓకే -సెన్సెక్స్‌ ఫ్లాట్‌!

డీల్‌ కుదుర్చుకోకుండా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడాన్ని(బ్రెక్సిట్‌) తిరస్కరిస్తూ బుధవారం రాత్రి యూకే పార్లమెంట్‌ ఓట్‌ చేసింది. ఈ అంశంపై గురువారం మరోసారి బ్రిటిష్‌ పార్లమెంట్ ఓటింగ్‌ను నిర్వహించనుంది. వెరసి బ్రెక్సిట్‌పై అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలో యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే, జర్మనీ 0.35 శాతం చొప్పున బలపడగా.. ఫ్రాన్స్‌ 0.75 శాతం ఎగసింది. కాగా.. నాలుగో త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం అంచనాలను చేరకపోవడంతో డాయిష్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ లుఫ్తాన్సా షేరు 6 శాతం పతనమైంది. 

అక్కడక్కడే
ఉన్నట్టుండి కన్సాలిడేషన్‌ బాటపట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 32 పాయింట్లు పెరిగి 37,784కు చేరింది. నిఫ్టీ సైతం నామమాత్రంగా 4 పాయింట్లు బలపడి 11,345 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించి 37,907కు చేరింది. తదుపరి ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది.

రియల్టీ జోరు
ఎన్‌ఎస్ఈలో రియల్టీ 2.2 శాతం ఎగసింది. ఫార్మా 0.8 శాతం పుంజుకోగా.. ఐటీ 0.7 శాతం వెనకడుగు వేసింది. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌ 6 శాతం జంప్‌చేయగా.. డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, సన్‌టెక్‌ 5-1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, ఎన్‌టీపీసీ, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, వేదాంతా, ఐవోసీ, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌ 3.6-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే  హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌, హీరో మోటో, యూపీఎల్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి.

అడాగ్‌ బోర్లా
డెరివేటివ్‌ కౌంటర్లలో పీసీ జ్యువెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, ఎన్‌బీసీసీ, భారత్‌ ఫైనాన్స్‌, అరవింద్‌, జస్ట్‌డయల్‌, దివాన్‌ హౌసింగ్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అడాగ్‌ కౌంటర్లు రిలయన్స్ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, జేపీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 6.3-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో వోల్టాస్‌, కంకార్‌, వీగార్డ్‌, హావెల్స్‌, ఇండియా సిమెంట్స్‌, పెట్రోనెట్‌ 3-2.4 శాతం మధ్య నష్టపోయాయి.

మిడ్‌ క్యాప్స్‌ డీలా
హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టడంతో చిన్న షేర్లలో అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.2 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1479 నష్టపోగా.. 1147 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular