మార్కెట్‌ అక్కడక్కడే- ఫార్మా ప్లస్‌లో!

మార్కెట్‌ అక్కడక్కడే- ఫార్మా ప్లస్‌లో!

రెండు రోజులుగా లాభాలు ఆర్జిస్తూ జోరుమీదున్న దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 15 పాయింట్లు పెరిగి 37,767కు చేరింది. నిఫ్టీ మాత్రం 3 పాయింట్లు నీరసించి 11,339 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 37,907వరకూ ఎగసింది. కాగా.. బుధవారం అమెరికా మార్కెట్ నీరసించగా.. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. 

ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్ వీక్‌
ఎన్‌ఎస్ఈలో ఫార్మా 0.8 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, ఐబీ హౌసింగ్‌, ఎన్‌టీపీసీ, వేదాంతా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ 2.4-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే అల్ట్రాటెక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టైటన్‌, హిందాల్కో, హీరో మోటో, అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

అడాగ్‌ బోర్లా
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్‌ ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీసీసీ, జస్ట్‌డయల్‌, ఇన్ఫీబీమ్‌, ఐసీఐసీఐ ప్రు 3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అడాగ్‌ కౌంటర్లు రిలయన్స్ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 6.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో జైన్‌ ఇరిగేషన్‌, కంకార్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, వోల్టాస్‌, ఇండియా సిమెంట్స్‌, వీగార్డ్‌ 2.8-2.2 శాతం మధ్య నష్టపోయాయి.

మిడ్‌ క్యాప్స్‌ డీలా
హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టడంతో చిన్న షేర్లలో అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.35 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1398 నష్టపోగా.. 945 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular