ఎస్సెల్‌ ప్రొప్యాక్‌- డీసీఎం శ్రీరామ్‌ భల్లేభల్లే

ఎస్సెల్‌ ప్రొప్యాక్‌- డీసీఎం శ్రీరామ్‌ భల్లేభల్లే

గతంలో జారీ చేసిన రుణ సెక్యూరిటీల(కమర్షియల్‌ పేపర్స్‌)ను రీడీమ్‌ చేసినట్లు వెల్లడించడంతో లామినేటెడ్‌ ట్యూబ్స్‌ ప్యాకేజింగ్‌ దిగ్గజం ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ కౌంటర్‌ జోరందుకుంది. మరోపక్క సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా విద్యుదుత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేసినట్లు తెలియజేయడంతో డీసీఎం శ్రీరామ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్సెల్‌ ప్రొప్యాక్‌
తాజాగా రూ. 50 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ చెల్లింపును పూర్తిచేసినట్లు ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ పేర్కొంది. ఈ బాటలో మరో రూ. 35 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ను రీడీమ్‌ చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ షేరు 6.5 శాతం జంప్‌చేసి రూ. 116 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 119 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 57.04% వాటా ఉంది.

Image result for dcm shriram ltd

డీసీఎం శ్రీరామ్‌
ఉత్తరప్రదేశ్‌లోని డీఎస్‌సీఎల్‌ షుగర్‌ హరియవన్‌ యూనిట్‌లో ఏర్పాటు చేసిన 30 మెగావాట్ల పవర్‌ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమైనట్లు డీసీఎం శ్రీరామ్‌ పేర్కొంది. దీనిలో 22.5 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేసేందుకు వీలున్నట్లు తెలియజేసింది. ఎరువులు, షుగర్‌, క్యాస్టిక్‌ సోడా తయారీ కంపెనీలో ప్రమోటర్లకు 66.53% వాటా ఉంది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డీసీఎం శ్రీరామ్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 468 వద్ద ట్రేడవుతోంది. Most Popular